కుప్పం వాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. కుప్పం నియోజకవర్గంలో కృష్ణమ్మ అడుగుపెట్టింది. హంద్రీ - నీవా ప్రాజెక్టులో భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ గుండా కృష్ణా జిల్లాలు కుప్పంలో అడుగుపెట్టాయి. పరమ సముద్రం అనే గ్రామం వద్ద నుంచి కృష్ణా జలాలు కుప్పం మండలంలోకి ప్రవేశించాయి. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కుప్పంకు వెళ్లి పరమసముద్రం వద్ద కృష్ణమ్మకు హారతులు పట్టి స్వాగతం పలకనున్నారు. తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టిన కృష్ణా జలాలకు సీఎం ప్రత్యేక పూజలు…
నల్లగొండ జిల్లా నార్కట్ పల్లిలో ప్రొఫెసర్ కోదండరాం కృష్ణ జలాల పరిరక్షణ యాత్రలో భాగంగా వాసవి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు కృష్ణ బోర్డ్ సమావేశం కాబోతుంది. ఈ సమావేశ్మలో శ్రీశైలం, నాగార్జునసాగర్ లో ఉన్న 15 ఔట్ లెట్స్ కావాలని అడుగుతున్నారన్నారు. ఆర్డీఎస్ 15.9టీఎంసీల రావాలి కానీ సగం కూడా రావడం లేదు. ఈ అంశంపై ఇప్పటికీ కూడా మనకు న్యాయం చెయ్యలేక పోయింది. తప్పని…
కృష్ణా నది జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. మంత్రులు, నేతల మధ్య మాటల యుద్ధం సాగగా… కేంద్ర ప్రభుత్వం గెజిట్లతో వివాదాలకు తెరదింపాలని చూసింది.. కానీ, వాటిపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. మరోవైపు.. కృష్ణా నదీ జలాలను 50:50 నిష్పత్తిలో పంచాలని కోరుతూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డును లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం.. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ ఛీప్ మురళీధర్‌రావు కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు…
కర్నూలు వేదికగా జరిగిన బీజేపీ రాయలసీమ స్థాయి సమావేశం ముగిసింది.. సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధిపై చర్చించారు నేతలు.. ఇక, సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఏపీ, తెలంగాణ సీఎంలపై సంచలన ఆరోపణలు చేశారు.. కేసీఆర్, జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారని కామెంట్ చేసిన ఆయన.. రాత్రి ఫోన్‌లో మాట్లాడుకుంటారు.. పగలు ఉత్తరాలు రాస్తారంటూ విమర్శించారు.. ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం రోజున కేసీఆర్ చెప్పింది ఒకటి.. ఇప్పుడు చేస్తున్నదొకటి.. ఏపీ,…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణానదిపై చేపట్టిన ప్రాజెక్టులు మరోసారి వివాదం రేపుతున్నాయి.. ఇప్పటికే ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదులు, కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖలు రాయడం నడుస్తుండగా.. మరోవైపు.. రెండు రాష్ట్రాల నుంచి అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది… ఇటీవల మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. ఈ సందర్భంగా లంకలో పుట్టినొల్లంతా రాక్షసులే అంటూ కామెంట్…