కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం లో నీ సిటీ సెంట్రల్ హాల్ లో టీఎన్జీవో అంగాన్ వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… గతం లో వేతనాలు పెంచాలంటే ధర్నాలు చేసి లాఠీ దెబ్బలు తింటే జీతాలు పెరిగేది. తెలంగాణ ఫిరాష్ట్రం లో ఎటువంటి ధర్నాలు లేకుండా అంగన్వాడి లకు జీతాలు పెంచిది రాష్ట్ర ప్రభుత్వం. గత ఎడేళ్లలో అంగన్వాడి టీచర్ లకు మూడు సార్లు జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ ది మాత్రమే. గుజరాత్ లో అంగన్వాడి టీచర్ జీతం మనం ఇచ్చే అయ జీతం తో సమానం అన్నారు.
గ్యాస్ సిలిండర్ ధర 950 రూపాయలు పంచి సబ్సిడీ ధర తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. గ్యాస్ సిలిండర్ ల పై రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ విధించలేదు కేంద్రం విధించిన జిఎస్టి మాత్రమే ఉంది. గ్యాస్ సబ్సిడీ ఇప్పుడు 40 రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. అంగన్ వాడి 13950 జీతం లో కేంద్ర ప్రభుత్వ వాటా 2700 మాత్రమే. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఈ సారి 18 శాతం బడ్జెట్ తగ్గించింది.రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను పెంచింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ,డీజిల్,గ్యాస్ ధర పెంచుతూ సబ్సిడీ తగ్గిస్తుంది.ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతుంది. ఆనాడు రెండు 200 వందల ఉన్న పెన్షన్ ను 2016 చేసినం. సంక్షేమ పథకాలను కొంత మంది నాయకులు విమర్శిస్తున్నారు. అంగన్వాడి టీచర్లకు 450 సూపర్వైజర్ లాగా నాలుగైదు రోజుల్లో ప్రమోషన్. కరోనా తో ఆర్థికం గా రావాల్సిన ఆదాయం రాకపోవడం వల్లే ఆలస్యం గా జీతాలు వస్తున్నాయి. కానీ రాబోయే రోజుల్లో మొదటి వారం లో జీతాలు వచ్చేలా చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు.
ఇక ఇప్పటి వరకు చేసింది కేసీఅర్ ఇగ ముందు చెయ్యాల్సింది కూడా కేసీఅర్ నే అందుకే ప్రభుత్వానికి అండగా ఉండాలి. అంగన్వాడి టీచర్ల రిటైర్మెంట్ సంభందించి ముఖ్యమంత్రి గారి తో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తా. అంగన్వాడి టీచర్లు మహిళ సంఘాల్లో ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఇల్లు లేని ప్రతి అర్హులైన అంగన్వాడి టీచర్లకు డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తాం. హుజూరాబాద్ నియోజక వర్గంలో గతం లో ఉన్న మాజీ మంత్రి ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టలేదు. ఏడు సంవత్సరాలుగా ఒక్క డబుల్ బెడ్ రూం ఇంటికి కూడా మాజీ మంత్రి గృహ ప్రవేశం చేయకపోవడం దురదృష్టకరం. అంగన్వాడి లకు పి ఎఫ్ ఈ ఎస్ ఐ ల పై ప్రభుత్వ పరిశీలనలో ఉంది. కరోనా తో చనిపోయిన అంగన్వాడి టీచర్ల వారి కుటుంబం లో ఒకరికి ఉద్యోగం అని తెలిపారు.