Telangana: తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత సమస్య త్వరలో తీరనుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీనితో రాష్ట్రానికి అదనంగా మరో 40 వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఇప్పటికే రాష్ట్రానికి కేటాయించిన 40 వేల టన్నులకు అదనంగా లభించనుంది.
Medha School : సంచలనం.. మేధా స్కూల్ కరస్పాండెంట్ రిమాండ్.. కీలక అంశాలు వెలుగులోకి
రబీ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలో యూరియాకు డిమాండ్ పెరిగింది. సరఫరాలో జాప్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి రాష్ట్రానికి అదనపు యూరియా కేటాయించాలని కోరారు. కేంద్రం ఈ విజ్ఞప్తిని వెంటనే మన్నించడంతో, రాష్ట్రానికి మొత్తం ఐదు ఓడల నుండి యూరియా కేటాయింపులు జరిగాయి.
సెప్టెంబర్ నెల మొదటి 15 రోజుల్లోనే రాష్ట్రానికి 1,04,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయింది. ఇప్పుడు అదనంగా మరో 40 వేల టన్నులు లభించడంతో మొత్తం సరఫరా మరింత పెరిగి రైతుల అవసరాలు తీరనున్నాయి. ఈ నిర్ణయం వ్యవసాయ రంగంలో ఒక పెద్ద ఊరటగా భావించవచ్చు.
రాబోయే రోజుల్లో యూరియా కొరత పూర్తిగా తీరి, రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు పనులు కొనసాగించవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం రైతులకు ఎంతో ఊరట కలిగిస్తుంది. రానున్న రోజుల్లో పంటలకు అవసరమైన యూరియా సకాలంలో అందుబాటులో ఉండి దిగుబడి పెరగడానికి తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Unbelievable: భయం మా చెడ్డది సుమీ..! కుక్కల భయానికి ఇంటిపైకెక్కిన ఎద్దు.!