తెలంగాణలో రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,217 కొత్త కేసులు నమోదు కావడంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 7,75,530కి చేరింది.. మరో కోవిడ్ బాధితుడు మృతిచెందడంతో మృతుల సంఖ్య 4,100కు చేరగా.. మరో 3,944 మంది కోవిడ్ బాధితులు పూర్తి స్థాయిలో కోలుకోవడంతో.. రికవరీ కేసుల సంఖ్య 7,46,932కు పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రంలో 26,498 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 48,434 శాంపిల్స్ పరీక్షించామని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.
Read Also: డిజిటల్ కరెన్సీ లాంచ్ అప్పుడేనా..?