Road Accident: బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం… ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేవుడి దర్శనం కోసం వెళ్లిన ఒక కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందడంతో.. వారి కుటుంబంలో రోధనలు మిన్నంటాయి… కర్ణాటకలోని బీదర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీదర్‌లోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. కంటైనర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది కారు.. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జైంది… ఈ ప్రమాదంలో ఐదురుగు మృతిచెందగా.. మరో ఐదురుగు తీవ్రగాయాలపాలయ్యారు.. నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు.. చిన్నారి సహా ఐదుగురు ఒకే ఫ్యామిలీకి చెందిన వ్యక్తులు మృతిచెందారు.. హైదరాబాద్ బేగంపేటకు చెందిన గిరిధర్ (45), ప్రియ (15), అనిత (30), మహేక్ (2), డ్రైవర్ జగదీష్ (35) మృతిచెందినట్టుగా గుర్తించారు పోలీసులు.. ఇక, గీత, రజిత, ప్రభావతి, షాలిని, హర్షవర్ధన్ ఆసుపత్రిలో చేరారు..
Also Read
- CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!
- Ganesh Immersion 2026: గణేశ్ నిమజ్జనంపై హైటెక్ నిఘా.. 10 వేల కెమెరాలు, డ్రోన్లు రెడీ.!
- Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
- Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు గిరీధర్.. దైవదర్శనం కోసం కర్ణాటక రాష్ట్రానికి వెళ్లారు.. కలబురగి జిల్లా గంగాపూర్‌కు చెందిన దత్తాత్రేయను దర్శించుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన గిరీధర్ ఫ్యామిలీలోని 10 మంది కారులో బయల్దేరి వెళ్తుండగా.. బీదర్ తాలూకా బంగూర్ సమీపంలో జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ఘటనపై బీదర్ తాలూకా మన్నల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఒకే ఫ్యామిలీకి చెందిన ఐగురు ఒకే సారి ఐదుగురి ప్రాణాలు పోవడంతో.. విషాదంగా మారింది.
తాజావార్తలు
-
CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
-
Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
-
CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!
-
Kaaka Update: సంక్రాంతి బరి నుంచి తగ్గేదేలే.. ‘కాకా’ పనులు షురూ!
-
Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!