Telangana: తెలంగాణలో ‘నోటిఫైడ్ డిసీజ్’గా క్యాన్సర్.. ఇకపై ప్రతి కేసు నివేదించడం తప్పనిసరి.!
- క్యాన్సర్‌కు నోటిఫైడ్ హోదా
- ప్రతి కేసు రికార్డ్ తప్పనిసరి
- ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా నిబంధన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న క్యాన్సర్ మహమ్మారిని కట్టడి చేసేందుకు, ఇకపై ఈ వ్యాధిని ‘నోటిఫైడ్ డిసీజ్’ (Notifiable Disease) గా గుర్తిస్తూ ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ జీవో నంబర్ 17ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రంలోని ఏ మూలన క్యాన్సర్ కేసు నమోదైనా, ఆ వివరాలను ప్రభుత్వం నిర్దేశించిన పోర్టల్‌లో నమోదు చేయడం ఇప్పుడు చట్టబద్ధంగా అనివార్యం.
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
గతంలో కేవలం నిమ్స్ (NIMS) , మెహదీ నవాజ్ జంగ్ (MNJ) వంటి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో మాత్రమే క్యాన్సర్ రిజిస్ట్రీలు నిర్వహించబడేవి. దీనివల్ల ప్రైవేట్ రంగంలో చికిత్స పొందుతున్న వేలాది మంది రోగుల వివరాలు ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉండేవి కావు. ఫలితంగా వ్యాధి తీవ్రత ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది, ఏ వయస్సు వారు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు అనే అంశాలపై ఖచ్చితమైన అంచనా ఉండేది కాదు. ఈ లోటును భర్తీ చేస్తూ, ఇకపై ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, , చివరకు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా తమ వద్దకు వచ్చే క్యాన్సర్ కేసుల వివరాలను ఒక నెల రోజుల్లోపు ఆరోగ్య శాఖకు నివేదించాల్సి ఉంటుంది.
Trump: ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతమైపోతుంది.. ట్రంప్ చివరి హెచ్చరిక
ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల ఖచ్చితమైన డేటా ప్రభుత్వం వద్ద కేంద్రీకృతం అవుతుంది. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే (MNJ) క్యాన్సర్ ఆసుపత్రి ఈ సమాచార సేకరణకు కేంద్ర బిందువుగా వ్యవహరిస్తుంది. సేకరించిన ఈ డేటా ఆధారంగా ప్రభుత్వం భవిష్యత్తులో ఎక్కడ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి, ఏ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి , ఎక్కడ పాలియేటివ్ కేర్ సేవలను విస్తరించాలి అనే విషయాలపై శాస్త్రీయమైన ప్రణాళికలు రూపొందిస్తుంది. రోగుల వ్యక్తిగత వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతూనే, ప్రజారోగ్య ప్రయోజనాల కోసం ఈ గణాంకాలను విశ్లేషించి క్యాన్సర్ రహిత తెలంగాణ దిశగా అడుగులు వేయడం ఈ జీవో ప్రధాన ఉద్దేశ్యం.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!