Gautam Gambhir: కోచింగ్ శైలిపై ఆటగాళ్ల అసంతృప్తి.. గంభీర్‌పై బీసీసీఐకి సీనియర్ల ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పట్టు సడలుతోందా? ఒక ఏడాది క్రితం వరకు బీసీసీఐ (BCCI)లో ఆయనకు ఉన్న ప్రాబల్యం, హోదా ఇప్పుడు తగ్గుముఖం పట్టాయా? అంటే అవుననే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ‘cricblogger.com’ ప్రచురించిన కథనం ప్రకారం.. వరుసగా కొన్ని కీలకమైన మ్యాచ్‌లలో ఓటముల తర్వాత గంభీర్ నిర్ణయాలు, ఆయన కోచింగ్ శైలిపై బోర్డులో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. జట్టులోని కొందరు సీనియర్ ఆటగాళ్లు గంభీర్ వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారట. అంతేకాదు.. బీసీసీఐకి సైతం ఫిర్యాదు చేశారని సమాచారం. ఓటములకు స్వయంగా బాధ్యత వహించడానికి బదులుగా సపోర్ట్ స్టాఫ్ లేదా ఆటగాళ్లపై నెట్టేయడంపై బీసీసీఐ అధికారులు ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది.
గంభీర్‌కు వ్యతిరేకంగా మారుతున్న వాతావరణం?
బోర్డులోని కొందరు అధికారుల అభిప్రాయం ప్రకారం.. గంభీర్ తరచూ ఓటములకు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ (CoE) లేదా సపోర్ట్ స్టాఫ్‌ను బలిపశువులను చేస్తుంటారు. ఇప్పటికీ బీసీసీఐ నుంచి గంభీర్‌కు కొంత మద్దతు ఉన్నప్పటికీ, తనకు లభించిన పూర్తి స్వేచ్ఛను, నియంత్రణను ఆయన సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారని కొందరు భావిస్తున్నారు. తనకిష్టమైన సపోర్ట్ స్టాఫ్‌ను ఎంచుకునే అవకాశం లభించినా, తుది నిర్ణయాల్లో ఆయన ప్రభావం ఎక్కువగా ఉన్నా ఫలితాలు మాత్రం ఆశాజనకంగా లేవని విమర్శలు వస్తున్నాయి.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
గంభీర్‌కు ఉన్న ఒకే ఒక్క ఊరట:
బీసీసీఐ మనస్తత్వం క్రమంగా మారుతుండటంతో రాబోయే శ్రీలంక పర్యటన గంభీర్‌కు అత్యంత కీలకమైన అగ్నిపరీక్షగా మారింది. ఇందులోనూ విఫలమైతే ఆయన పదవిపై మరిన్ని ప్రశ్నలు రావడం ఖాయం. అయితే, టెస్టుల్లో వరుస ఘోర ఓటములు, ఇటీవల ముగిసిన యుకే (UK) పర్యటనలో నిరాశాజనక ప్రదర్శన ఎదురైనప్పటికీ.. గంభీర్‌కు ఒక పెద్ద ఊరట లభించే అంశం ఉంది. అదేంటంటే, బీసీసీఐతో ఆయనకు 2027 వరకు ఉన్న కాంట్రాక్ట్. వన్డే వరల్డ్ కప్‌కు ఇంకా ఏడాది సమయం కూడా లేని నేపథ్యంలో, బీసీసీఐ వంటి ప్రతిష్టాత్మక బోర్డు ఎంత ఒత్తిడి ఉన్నా ప్రధాన కోచ్‌ను సడన్‌గా తొలగించే సాహసం చేయకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!