BCCI మాస్టర్ ప్లాన్.. నెక్స్ట్ జెనరేషన్ టెస్ట్ క్రికెటర్లను తీర్చిదిద్ధేందుకు ప్రత్యేక రోడ్ మ్యాప్..!
- భారత టెస్ట్ జట్టుకు కొత్త తరం ఆటగాళ్లను తయారు చేయడానికి బీసీసీఐ మాస్టర్ ప్లాన్
- U-25 హై-పెర్ఫార్మెన్స్ క్యాంప్ కోసం 25 మంది ఆటగాళ్ల షార్ట్‌లిస్ట్ విడుదల
- బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్షణ శిబిరం నిర్వహణ
- ఐపీఎల్ 2026 తర్వాత జూన్-జూలైలో రెడ్ బాల్ (4-రోజుల మ్యాచ్‌లు) టోర్నమెంట్
- దేశవ్యాప్తంగా 64 మంది యువ క్రికెటర్లు టోర్నీలో పాల్గొననున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI: భారత క్రికెట్ జట్టుకు నెక్స్ట్ జెనరేషన్ టెస్ట్ సూపర్ స్టార్లను అందించడమే లక్ష్యంగా బీసీసీఐ (BCCI) మాస్టర్ ప్లాన్ వేసింది. U-25 పురుషుల హై-పెర్ఫార్మెన్స్ క్యాంప్ కోసం 25 మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేస్తూ నేడు (ఏప్రిల్ 7) ఓ లిస్ట్ విడుదల చేసింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) ఆధ్వర్యంలో ఈ శిక్షణ శిబిరం జరగనుంది.
Rahane-Sehwag: మాటలు వద్దు, ఆడి చూపించు.. కేకేఆర్ కెప్టెన్ రహానేపై సెహ్వాగ్ ఫైర్!
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే.. అంటే జూన్, జూలై నెలల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లోపల ఒక ప్రత్యేక టోర్నమెంట్ ను నిర్వహించనున్నారు. ఇది పూర్తిగా ‘రెడ్ బాల్’ (నాలుగు రోజుల మ్యాచ్‌లు) ఫార్మాట్‌లో సాగుతుంది. ఈ టోర్నమెంట్‌లో దేశవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ 64 మంది యువ క్రికెటర్లు పాల్గొంటారు. ఇక వీరి ఎంపిక చూస్తే.. సి.కె. నాయుడు ట్రోఫీ, U-23 వన్డేల నుండి 25 మంది, రంజీ ట్రోఫీ, విజయ్ హజారే (VHT), సయ్యద్ ముస్తాక్ అలీ (SMAT) టోర్నీల నుండి 25 మందిని సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తుంది. అలాగే ఐపీఎల్ (IPL) ఆడుతున్న యువ ఆటగాళ్ల నుండి 14 మందిని సెలెక్ట్ చేయనున్నారు.
ప్రస్తుతం విడుదల చేసిన 25 మంది జాబితాలో స్టార్ ప్లేయర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే పేర్లు లేకపోవడంతో అభిమానుల్లో సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే వీరు ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్నందున పైన పేర్కొన్న ’14 మంది ఐపీఎల్ కోటా’ జాబితాలో వీరిని చేర్చనున్నారు. ప్రస్తుతం ఆయుష్ మాత్రే చెన్నై సూపర్ కింగ్స్‌కు, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్‌గా రాణిస్తున్నారు. ఈ క్యాంప్ కోసం ఎంపికైన వారిలో యశ్ ధుల్, రాజ్ లింబానీ, సిద్ధార్థ్ దేశాయ్ వంటి ఐపీఎల్ అనుభవం ఉన్న ఆటగాళ్లతో పాటు కొత్త ముఖాలు కూడా ఉన్నాయి.
Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!
ఈ టోర్నమెంట్, క్యాంప్ అంతా బీసీసీఐ CoE హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో జరగనుంది. ఏప్రిల్ 12 నుండి మే 7 వరకు బెంగళూరులో ఈ శిబిరం కొనసాగుతుంది. ప్రతిభావంతులైన యువకులను గుర్తించి వారిని అంతర్జాతీయ స్థాయికి సిద్ధం చేయడమే లక్ష్మణ్ ప్రధాన బాధ్యత. ఐపీఎల్ తర్వాత భారత్ U-19, ఇండియా ఎమర్జింగ్ (U-25) జట్లు శ్రీలంక పర్యటనకు కూడా వెళ్లనున్నాయి. ఈ టోర్నీ ద్వారా ఎంపికైన వారు భవిష్యత్తులో భారత టెస్ట్ జట్టులో కీలక సభ్యులుగా మారే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!