Ronaldo Wedding Rumors: నలుగురు పిల్లల తల్లితో రొనాల్డో పెళ్లి? వైరల్ అవుతున్న ఫుట్‌బాల్ దిగ్గజం వెడ్డింగ్ డేట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ronaldo Wedding Rumors: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో పెళ్లిపై అంతర్జాతీయ మీడియాలో చర్చ మొదలైంది. పోర్చుగల్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ Correio da Manhã కథనం ప్రకారం.. క్రిస్టియానో రొనాల్డూ – జార్జినా రోడ్రిగెస్ ఆగస్టు 8న వివాహ బంధంలోకి అడుగుపెట్టే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తపై ఇప్పటివరకు రొనాల్డో లేదా జార్జినా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. మీడియా కథనాల ప్రకారం.. పోర్చుగల్‌లోని మదీరా ద్వీపంలోని చారిత్రాత్మక ఫుంచల్ కేథడ్రల్‌లో ఈ వివాహం జరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ ప్రాంతంతో రొనాల్డోకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన బాల్యం మదీరాలోనే గడవగా, అక్కడి నుంచే ఆయన ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్రయాణాన్ని ప్రారంభించారు. అందుకే ఆయన తన పెళ్లి వేదికగా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు ప్రచారం సాగుతోంది.
పెళ్లి వేడుక ఎక్కడంటే..
వివాహం అనంతరం జరిగే వేడుక కోసం మదీరాలోని ప్రముఖ ఫైవ్‌స్టార్ సవోయ్ ప్యాలెస్ హోటల్‌ను బుక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అతిథుల కోసం హోటల్లోని కొన్ని ప్రత్యేక గదులను రిజర్వ్ చేసినట్లు సమాచారం. అయితే ఈ వివరాలపై కూడా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ బయటికి రాలేదు. ఈ వార్తలు నిజమైతే, రొనాల్డో – జార్జినా జంట సంప్రదాయ క్యాథలిక్ చర్చ్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు చెబుతున్నారు. క్యాథలిక్ కుటుంబంలో పెరిగిన రొనాల్డో కుటుంబ విలువలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. అందుకే ఫుంచల్ కేథడ్రల్‌ను వివాహ వేదికగా ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పెళ్లి తేదీ, వేదిక గురించి వార్తలు వస్తున్నప్పటికీ, అతిథుల జాబితా, వేడుకకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం అతిథులందరితో నాన్-డిస్క్లోజర్ అగ్రిమెంట్ (NDA) సంతకం చేయించడంతో పాటు ఫోటోగ్రఫీపై కూడా కఠిన నిబంధనలు ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశాలపై కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
- Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్‌ప్రీత్ సంతోషం!
- Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
- Lala Amarnath: భారత్‌కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
తొమ్మిదేళ్ల ప్రేమ ప్రయాణం
రొనాల్డో – జార్జినా 2017లో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లోని గూచీ స్టోర్‌లో తొలిసారి కలుసుకున్నారు. అప్పట్లో జార్జినా అక్కడ సేల్స్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండేది. ఆ పరిచయం తర్వాత కాలంలో ప్రేమగా మారి, ఆ తర్వాత ఇద్దరూ తమ బంధాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. దాదాపు తొమ్మిదేళ్లుగా కలిసి జీవిస్తున్న ఈ జంట 2025 ఆగస్టు 11న తమ నిశ్చితార్థాన్ని ప్రకటించింది. జార్జినా తన డైమండ్ ఎంగేజ్మెంట్ రింగ్ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులకు ఈ విషయం తెలిసింది. రొనాల్డో పెద్ద కుమారుడు క్రిస్టియానో జూనియర్‌ను కూడా జార్జినా తన సొంత బిడ్డలా పెంచుతోంది. 2017లో సరొగసీ ద్వారా రొనాల్డోకు కవలలు మటేయో, ఇవా జన్మించారు. అదే ఏడాది నవంబర్‌లో జార్జినా ఎలానా మార్టినా అనే కుమార్తెకు జన్మనిచ్చింది. 2022లో మరోసారి కవలలకు జన్మనివ్వగా, డెలివరీ టైంలో కుమారుడు మరణించడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. అయితే కుమార్తె బెల్లా ఎస్మెరాల్డా క్షేమంగా జన్మించింది. ఆ సమయంలో రొనాల్డో, జార్జినా చేసిన భావోద్వేగ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కదిలించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రొనాల్డో – జార్జినా పెళ్లి వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
Realme 16T 5G: 8000mAh బ్యాటరీతో అదరగొట్టే 5G ఫోన్.. 50MP కెమెరా, 144Hz డిస్ప్లే
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
ట్రెండింగ్
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!