ఇక ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇక, ఖాళీల భర్తీకై వార్షిక నియామక కేలెండర్ (జాబ్ క్యాలెండర్ ) విడుదల చేయాలని నిర్ణయించింది తెలంగాణ కేబినెట్.. ఇవాళ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్… సుదీర్ఘంగా ఏడు గంటలకు పైగా సాగింది.. కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగుల జిల్లాల వారీ కేటాయింపులు, నూతన జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపులు, మరియు అధికారుల కేటాయింపులు చేపట్టాల్సిందిగా టీఎన్‌జీవో, టీజీవో ప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు చేసిన విజ్జప్తిని పురస్కరించుకుని అందుకు సంబంధించి కేబినెట్ చర్చించింది. ఉద్యోగ సంఘాల కోరిక మేరకు జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపు, అధికారుల కేటాయింపును సత్వరమే చేపట్టాలని, ఖాళీల గుర్తింపు మరియు భర్తీ ప్ర్రక్రియ సత్వరమే జరగాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. ఇక, అన్ని రకాల పోస్టులలో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం రిక్రూట్ మెంట్ కోసం ‘వార్షిక క్యాలెండర్ ’ ను తయారు చేయాలని అధికారులను ఆదేశించింది కేబినెట్.. ప్రతి సంవత్సరం ఖాళీల భర్తీకై.. ‘వార్షిక నియామక క్యాలెండర్ ను తయారు చేసి అందుకు అనుగుణంగా విధిగా భర్తీ ప్రక్రియ నిర్వహించాలని కేబినెట్ ఆదేశించింది.. ఉద్యోగ ఖాళీల భర్తీకై చేపట్టాల్సిన చర్యలు, ఖాళీల గుర్తింపు కొరకు రేపు కూడా కేబినెట్ సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులను పూర్తి వివరాలతో హాజరు కావాలని కేబినెట్ ఆదేశించిన సంగతి తెలిసిందే కాదు.. రేపు మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది.
Also Read
తాజావార్తలు
-
Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
-
7 Seater Cars: మారుతి ఎర్టిగా నుంచి మహీంద్రా బొలెరో వరకు.. రూ.5.65 లక్షల నుంచి లభించే చౌకైన 7-సీటర్ కార్లు ఇవే
-
Samantha Ruth Prabhu : ‘మా ఇంటి బంగారం’ హీరోయిన్ సాయి పల్లవా ? ఆ ఛాన్స్ సామ్ ఎలా కొట్టేసిందంటే ?
-
Vivo V70 Lite: వివో V70 లైట్ విడుదల.. 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే
-
Astrology: డబ్బు విషయంలో ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త.. ఖర్చు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తారట!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!