Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని దర్శకుడు సుజీత్‌తో కలిసి ‘బ్లడీ రోమియో’ అనే హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా చేయనున్న సంగతి తెలిసిందే. వినూత్నమైన కథాంశంతో, డార్క్ హ్యూమర్ మేళవించిన స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ కథగా రూపుదిద్దుకుంటున్న ఈ మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్‌పై ఆరంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి క్యాస్టింగ్ విషయంలో ఫిల్మ్‌నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో కథానాయికగా నిన్నటి వరకు ‘లక్కీ భాస్కర్’ ఫేమ్ మీనాక్షి చౌదరి పేరు ప్రముఖంగా వినిపించింది. మేకర్స్ కూడా మొదట ఆమెనే ప్రతిపాదించారని సమాచారం. కానీ తాజా సమాచారం ప్రకారం, ఈ రేసులోకి మరో తమిళ భామ ప్రీతి ముకుందన్ వచ్చి చేరినట్లు టాక్ నడుస్తోంది. దర్శకుడు సుజీత్ డిజైన్ చేసిన పాత్రకు మీనాక్షి కంటే ప్రీతి ముకుందన్ బాగా సెట్ అవుతాయని భావించిన మేకర్స్, ఆమె వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ పేరునే దాదాపు ఫైనల్ చేసినట్లు సమాచారం. యూకే బ్యాక్‌డ్రాప్‌లో ఫుడ్ అండ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరెకెక్కనున్న ఈ సినిమాలో నాని సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై మేకర్స్ అధికారికంగా హీరోయిన్ ఎవరో త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ప్యారడైజ్ ప్లాప్ తర్వాత నాని నుండి రాబోతున్నబ్లడీ రోమియో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పాటు నాని సొంత సంస్థ యూనానిమస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
Also Read
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
తాజావార్తలు
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!