ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ విజేతగా భారత్ నిలిచింది. ఈ టోర్నీ ఫైనల్‌లో 52 కిలోల విభాగంలో థాయ్‌లాండ్ బాక్సర్ జిత్పోంగ్ జుటామాను ఓడించి తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. నిఖత్ జరీన్ నిజామాబాద్ వాసి. ఆమెకు 25 ఏళ్లు. తన కెరీర్‌లో తొలి ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ‘వరల్డ్ ఛాంపియన్‌షిప్’ బంగారు పతకాన్ని నిఖత్ జరీన్ గెలిచింది. భారత్ నుంచి గతంలో మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్‌ఎల్, లేఖ.సి మాత్రమే ఈ టోర్నీలో ఛాంపియన్లుగా నిలిచారు.