సార్వత్రిక ఎన్నికల వేళ దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నేత, బాక్సర్ విజేందర్ సింగ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు.
Pakistan Boxer steals money from teammate bag in Italy: విదేశాలకు వెళ్లిన ఓ పాకిస్థాన్ బాక్సర్ ఎవరూ ఊహించని పని చేశాడు. సహచర క్రీడాకారిణి బ్యాగ్ నుండి డబ్బు దొంగిలించి.. అక్కడినుంచి పరార్ అయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్ అమెచ్యూర్ బాక్సింగ్ ఫెడరేషన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని ఇటలీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం దృష్టికి తీసుకెళ్లామని, ఈ ఘటనపై పోలీసు నివేదికను కూడా దాఖలు చేశామని ఫెడరేషన్ సీనియర్ అధికారి…
భారత బాక్సింగ్ దిగ్గజం, 1982 ఆసియా క్రీడల బాక్సింగ్ ఛాంపియన్ కౌర్ సింగ్(74) తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న కౌర్ సింగ్.. గురువారం హర్యానాలోని కురుక్షేత్ర ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు.
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ విజేతగా భారత్ నిలిచింది. ఈ టోర్నీ ఫైనల్‌లో 52 కిలోల విభాగంలో థాయ్‌లాండ్ బాక్సర్ జిత్పోంగ్ జుటామాను ఓడించి తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. నిఖత్ జరీన్ నిజామాబాద్ వాసి. ఆమెకు 25 ఏళ్లు. తన కెరీర్‌లో తొలి ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ‘వరల్డ్ ఛాంపియన్‌షిప్’ బంగారు పతకాన్ని నిఖత్ జరీన్ గెలిచింది. భారత్ నుంచి గతంలో మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్‌ఎల్, లేఖ.సి…
బాక్సింగ్ లోకం మరో మేటి స్టార్‌ను కోల్పోయింది. జర్మనీ స్టార్ బాక్సర్ ముసా యమక్ (38) గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. మునిచ్‌లో మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే యమక్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆస్పత్రికి తరలించే లోపే అతడు మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. ఉగాండాకు చెందిన హమ్జా వండెరాతో జరుగుతున్న మ్యాచ్ సమయంలో మూడో రౌండ్‌కు ముందు రింగ్‌లోనే యమక్ కుప్పకూలాడు. IPL 2022: అరగంట ఆలస్యంగా ఫైనల్ మ్యాచ్.. ఎందుకంటే..? ఈ విషయాన్ని గమనించిన అక్కడి సిబ్బంది…
ప్రపంచంలో ప్రతిభకు కొదవ లేదు. కొంతమంది పెద్దయ్యాక వారి ప్రతిభను ప్రదర్శిస్తే, మరికొందరు చిన్న తనం నుంచే వారి ప్రతిభను కొనసాగిస్తుంటారు. అంతర్లీనంగా దాగున్న ప్రతిభను ప్రదర్శించడంలో చిన్నారులు ఎప్పుడూ ముందు ఉంటారు. చిన్నతనం నుంచి వారిలో దాగున్న ప్రతిభను ప్రొత్సహిస్తే తప్పకుండా చిన్నారులు ఉన్నత స్థితికి ఎదుగుతారు అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. రష్యాకు చెందిన 12 ఏళ్ల ఇవింక సావకస్ అనే చిన్నారికి చిన్నతనం నుంచి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. తండ్రి…