Kurnool Bus Fire : హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కర్నూల్ ఘటనలో మరణించిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారికి రూ.2 లక్షల సహాయం అందజేయనున్నట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.
Ananya Nagalla : గులాబి కళ్ళు రెండు ముల్లు చేసి.. గుచ్చుతున్న అనన్య నాగళ్ళ
ఇక కర్నూల్ సమీపంలో జరిగిన ఈ భయంకర రోడ్డు ప్రమాదంలో బైకర్‌తో కలిపి 20 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మంటల్లో కాలిపోయిన బస్సు నుంచి ఫోరెన్సిక్ బృందాలు 19 మృతదేహాలను వెలికితీశాయి. ఈ ఘటనలో 21 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిలో తెలంగాణకు చెందినవారి వివరాలు ఇంకా నిర్ధారించాల్సి ఉంది.
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన వారిలో సూరారం, జేఎన్‌టీయూ, పటాన్‌చెరు ప్రాంతాల నుంచి పలువురు ఉన్నారు. సూరారం వద్ద ఎక్కిన గుణసాయి కిటికీ ద్వారా దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. మరో ప్రయాణికుడు ప్రశాంత్ ఫోన్ స్విచ్‌ఆఫ్‌లో ఉందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జేఎన్‌టీయూ వద్ద ఎక్కిన ముగ్గురిలో ఒకరు సురక్షితంగా బయటపడ్డారు, మరో ఇద్దరి ఆచూకీ ఇంకా తెలియరాలేదు.
అంతేకాకుండా, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన పిలోమి నాన్ బేబీ (64), కుమారుడు కిషోర్‌కుమార్ (41) ఇటీవల దీపావళి పండుగకు హైదరాబాద్ వచ్చి బంధువుల వద్ద ఉన్నారు. గురువారం సాయంత్రం పటాన్‌చెరు అంబేద్కర్ చౌక్‌లో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కి బెంగళూరుకు బయలుదేరారు. అయితే చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రమాదం తర్వాత వారి ఆచూకీ తెలియరాలేదు. వీరి కోసం బంధువులు కర్నూలుకు వెళ్లి సమాచారం సేకరిస్తున్నారు.
Afghanistan: భారత్ బాటలో ఆఫ్ఘన్.. తాలిబన్ల దెబ్బతో పాకిస్థాన్‌కు నీటి గండం ఖాయం!