Tejeshwar Murder : తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన తేజేశ్వర్ హత్యకేసులో అసలు కథ బయటపడింది. ఈ కేసుపై గద్వాల జిల్లా ఎస్పీ ఒక ప్రెస్‌మీట్ నిర్వహించి నిందితుల కుట్రను బహిర్గతం చేశారు. తేజేశ్వర్ హత్య వెనుక ఉన్న ప్రేమ, ద్వేషం, కుట్రలను ఎస్పీ వివరించారు. బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు ఐశ్వర్యతో పాటు ఆమె తల్లితోనూ వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఐశ్వర్యను పెళ్లి చేసుకునేందుకు ఆమె కుటుంబం తేజేశ్వర్‌తో ఎంగేజ్‌మెంట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో తేజేశ్వర్ అడ్డు తొలగించాలని తిరుమలరావు హత్య కుట్ర పన్నాడని ఎస్పీ తెలిపారు.
Akhanda Godavari Project: ‘అఖండ గోదావరి’ టూరిజం ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన!
తేజేశ్వర్‌ను తొలగిస్తే, ఐశ్వర్యతో సంబంధం కొనసాగించవచ్చని భావించిన తిరుమలరావు, సుపారీ గ్యాంగ్‌ను సంప్రదించాడు. ఓసారి కాక చాలాసార్లు తేజేశ్వర్‌పై దాడికి ప్రయత్నించారు. చివరికి పొలం సర్వే చేయాల్సిన కారణంతో తేజేశ్వర్‌ను తీసుకెళ్లి, కారులోనే అతనిపై దాడి చేసి హత్య చేశారు. తేజేశ్వర్‌ను హత్య చేసిన అనంతరం తిరుమలరావు, ఐశ్వర్య లఢక్ లేదా అండమాన్‌కు వెళ్లి కొన్నిరోజులు ఎంజాయ్ చేయాలని పథకం వేసుకున్నారు. ఒకవేళ హత్య విఫలమైనా, ఈ ఆషాఢంలో లడక్‌కు వెళ్లాలనే ప్లాన్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
తిరుమలరావుకు సంతానం లేకపోవడం వల్ల, అతడు తన భార్యను కూడా అంతమొందించాలని భావించాడని పోలీసులు వెల్లడించారు. తేజేశ్వర్ అమాయకమైన వ్యక్తి కావడంతో భార్య తనపై చేస్తున్న స్కెచ్‌ను గుర్తించలేకపోయాడని ఎస్పీ అన్నారు. పోలీసులు మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఒక కారు, రెండు కత్తులు, కొడవళ్ళు, 10 మొబైల్ ఫోన్లు, GPS ట్రాకర్ వంటి ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. తేజేశ్వర్ జూన్ 17న మిస్సింగ్ అయినట్లు కేసు నమోదైందని తెలిపారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన వ్యక్తి కావడం విశేషం. అతని తెలివితో పోలీసులు ఆధారాలు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. మేఘాలయ మర్డర్ తరహాలోనే, హత్య అనంతరం ఏ ఆధారాలు మిగలకుండా చూసుకున్నారు. ఈ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు సాంకేతికంగా చురుగ్గా స్పందించి, కీలక నిందితులను అరెస్ట్ చేయడం ద్వారా కేసును ఛేదించారు. తేజేశ్వర్ కుటుంబం, గ్రామస్థులు ఈ న్యాయపరమైన చర్యలను ప్రశంసిస్తున్నారు.
Fairphone Gen 6: 5 ఏళ్ల వారంటీ, మరమ్మతులకు అనుకూలంగా ఉండేలా మొబైల్ లాంచ్..!