ఉద్యమాన్ని అణిచివేయడానికే సెలవులు: TPTF
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యమాన్ని అణిచి వేయడానికి ప్రభుత్వం సెలవులు ఇచ్చిందని టీపీటీఎఫ్ అధ్యక్షులు కె. రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరం మొదలై నాలుగు నెలలే అయిందన్నారు. 135 పని దినాల్లో అందులో ప్రత్యేక కార్యక్రమాలు, పరీక్షలు పోనూ జరిగిన బోధనా గంటలు మరీ తక్కువ.ఈ పరిస్థితుల్లో సెలవులను కుదించి, విద్యార్థులకు నష్ట నివారణకు చర్యలు చేపట్టకుండా సెలవులు ఇవ్వడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల్లో లోకల్ క్యాడరైజేషన్‌న గందరగోళంలో 15రోజుల విలువైన బోధన గంటలు వృధా అయ్యాయన్నారు. ఏ సమూహాలకు, సమావేశాలకు లేని ఒమిక్రాన్ భయం, నిబంధనలు విద్యా సంస్థలకే ఎందుకని వారు ప్రశ్నించారు. జీవో 317 పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చి ఉద్యమాన్ని నిలువరించేందుకు సెలవుల ప్రకటన చేశారని ఆరోపించారు. సంక్రాంతికి 3 రోజుల సెలవులు చాలన్న అభిప్రాయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. అడిగేది పక్కన పెట్టి, అనవసరమైన సెలవుల ప్రకటనలో తొందర ఎందుకని వారు మండిపడ్డారు.
Read Also: తిరుపతిలో టూరిజం ఉద్యోగి దారుణ హత్య
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
పారదర్శకత లేకుండా, స్థానికతను పరిగణలోకి తీసుకోకుండా హడావిడిగా చేసిన జిల్లాల కేటాయింపు ప్రక్రియను రద్దు చేసి, సరైన మార్గదర్శకాలతో తిరిగి చేపట్టాలని కొద్ది రోజులుగా ఉపాధ్యాయులు ఉద్యమిస్తున్నారన్నారు. దీనికి తోడు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు గొంతు కలుపుతున్నాయి. ఈ ఉద్యమాన్ని నిలువరించేందుకు సంక్రాంతి సెలవులను ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని వారు ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సంక్రాంతి ఆంధ్రా పండగ అని, ఇక్కడ పెద్దగా జరుపుకోరని ఇదే ముఖ్యమంత్రి గారు ప్రకటించి అప్పటి వరకు ఉన్న సెలవులు రద్దు చేసిన విషయం మర్చిపోవద్దని సూచించారు. టీచర్లు వ్యతిరేకిస్తున్న జిల్లాల కేటాయింపు, బదిలీలను ఏక పక్షంగా పూర్తి చేయడానికే, ఓమిక్రాన్ పేరుతో సెలవులు పొడిగించారని వారు ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా సంక్రాంతి సెలవులను 3 రోజులకు పరిమితం చేసి, లోకల్ క్యాడరైజేషన్ ప్రక్రియను పారదర్శకంగా, స్పష్టమైన మార్గదర్శకాలతో తిరిగి నిర్వహించాలని కె. రమణ, మైస శ్రీనివాసులు కోరారు.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!