తిరుపతిలో టూరిజం ఉద్యోగి దారుణ హత్య

టూరిజం ఉద్యోగి దారుణ హత్యకు గురైన సంఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రశేఖర్‌ అనే వ్యక్తిని సుత్తితో కొట్టి అత్యంత కిరాతకంగా హత్య చేసిన దుండగులు. అనంతరం చేతులు, కాళ్లు కట్టి గోనె సంచెలో కుక్కి అట్టపెట్టెలో ఫ్యాకింగ్ చేసి కారులో తరలించి భారకపేట అడవుల్లో పడేశారన్నారు. మృతుడు LB నగర్‌కు చెందిన చంద్రశేఖర్‌గా పోలీసులు గుర్తించారు. ఏపీ టూరిజం, ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో సూపర్‌వైజర్‌గా చంద్రశేఖర్‌ పని చేస్తున్నారు. చంద్రశేఖర్‌ వద్ద ఫైనాన్స్ తీసుకున్న మధు, రాజు, పురుషోత్తంలే హత్య చేశారని తేల్చిన పోలీసులు.

Read Also: ఏపీలో కొత్తగా 334 కరోనా కేసులు

గతంలో చంద్రశేఖర్ ను చంపడానికి మద్యంలో నిద్రమాత్రలు కలిపిన మధు, రాజు, పురుషోత్తం.. మొదటి ప్లాన్‌ బెడిసికొట్టడంతో ఈ సారి పక్కా స్కెచ్‌తో ప్లాన్‌ను అమలు చేశారు. ఎవ్వరికి అనునమానం రాకుండా చంద్రశేఖర్‌ బైక్‌ను మరో ఫైనాన్స్ తీసుకున్న వ్యక్తి కిషోర్‌ ఇంటి దగ్గర పార్కింగ్‌ చేసిన దుండగులు. సెల్ ఫోన్ ఆధారంగా రాజును అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు వాస్తవాలు వెల్లడయ్యాయి. పరారీలో ఉన్న మధు, పురుషోత్తంల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. మృతుడు చంద్రశేఖర్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Related Articles

Latest Articles