తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి ఉపాధ్యాయ సంఘాల నేతలు వచ్చారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సంఘాల్లో అతిపెద్ద సంఘం పీఆర్టీయూ.. గత ప్రభుత్వంలో రెండుగా విడిపోయాయని తెలిపారు. అంతేకాకుండా.. రెండు ఎమ్మెల్సీలను గెలుచుకున్న గొప్ప సంఘం పీఆర్టీయూ అని అన్నారు. విడిపోయిన నేతలతో మాట్లాడి రెండు సంఘాలు కలిసేలా చూశామని.. ఒప్పందం ప్రకారం విడిపోయిన రెండు సంఘాలు ఏకమయ్యాయని పేర్కొన్నారు. రెండు సంఘాలు కలవడం వల్ల బలం పెరిగింది..…
ఉద్యమాన్ని అణిచి వేయడానికి ప్రభుత్వం సెలవులు ఇచ్చిందని టీపీటీఎఫ్ అధ్యక్షులు కె. రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరం మొదలై నాలుగు నెలలే అయిందన్నారు. 135 పని దినాల్లో అందులో ప్రత్యేక కార్యక్రమాలు, పరీక్షలు పోనూ జరిగిన బోధనా గంటలు మరీ తక్కువ.ఈ పరిస్థితుల్లో సెలవులను కుదించి, విద్యార్థులకు నష్ట నివారణకు చర్యలు చేపట్టకుండా సెలవులు ఇవ్వడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల్లో లోకల్…
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులను మల్టీజోనల్ క్యాడర్ కేటాయింపులో భాగంగా రూపొందించిన సినియార్టీ జాబితాల్లోని లోపాలను సవరించి ఖచ్చితంగా జాబితాను రూపొందించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం డీయస్‌ఈ శ్రీదేవసేన తన కార్యాలయంలో గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాలను తెలియజేయాలని కోరారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. రాత్రి 12.00గంటలకు…