Tarun Chugh: కేసీఆర్ మోసాన్ని బీజేపీ నగ్నంగా బయటపెడుతుంది.. తరుణ్ చుగ్ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tarun Chugh Demands Sitting Judge Investigation On TSPSC Paper Leak: తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు. ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. ఈ పేపర్ లీకేజ్ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ, హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద శాంతియుత నిరసన చేపట్టిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జిని కూడా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. పై నుంచి ఆదేశాలు లేనిదే ఈ ప్రశ్నపత్రాల లీకేజ్ సాధ్యం కాదన్న ఆయన.. ఈ లీక్‌తో మోసపోయామని భావించిన వందలాది మంది యువకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు దాడి చేయలేరన్నారు. మహిళలను సైతం విచక్షణారహితంగా కొట్టారన్నారు. పోలీసుల లాఠీచార్జిలో పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిపాలయ్యారన్నారు.
Minister KTR: బండి సంజయ్ ఒక దద్దమ్మ, రాజకీయ అజ్ఞాని.. కేటీఆర్ ఫైర్
Also Read
సంజయ్ కుమార్‌ను అరెస్టు చేసో, ప్రజలపై దౌర్జన్యానికి పాల్పడో.. ఈ స్కామ్ నుంచి బయటపడొచ్చని కేసీఆర్ భావిస్తే.. అది అవివేకమే అవుతుందని తరుణ్ చుగ్ విమర్శించారు. ఈ స్కామ్‌పై హైకోర్టు సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ చేయించడానికి కేసీఆర్ ఎందుకు వెనుకాడుతున్నారు? ప్రశ్నించారు. కేసీఆర్ ఎందుకు నోరు విప్పడం లేదు? ఎవరిని రక్షించేందుకు చూస్తున్నారు? ఎందుకు ఈ మొండివైఖరి? అని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థత వల్ల.. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది యువకుల భవిష్యత్తు ఆగమైందని, వారి ఆవేదన ప్రభుత్వానికి ఎందుకు కనిపించడం లేదని అడిగారు. TSPSC స్కామ్‌కు పాల్పడిన అసలు దోషులను శిక్షించే వరకు.. ఉద్యోగార్థులకు, నిరుద్యోగులకు, యువతకు, విద్యార్థులకు తెలంగాణ బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలన్న డిమాండ్‌ను బీజేపీ తెలంగాణ శాఖ పునరుద్ఘాటిస్తోందని అన్నారు. యువత, TSPSC అభ్యర్థులు అధైర్యపడొద్దని సూచించారు. కెసిఆర్ మోసాన్ని బీజేపీ ప్రజల ముందు నగ్నంగా బయటపెడుతుందని.. అహంకారాన్ని ప్రదర్శిస్తున్న కేసీఆర్ కుటుంబం భారీ మూల్యం చెల్లించుకునే రోజు ఎంతో దూరం లేదని చెప్పారు.
Delhi Liquor Case: మనీష్ సిసోడియా ఈడీ విచారణలో సంచలన విషయాలు..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..