NTV Telugu Site icon

Tammineni Veerabhadram: బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ తో కలసి ఉంటాం

Tammineni Verabhadram

Tammineni Verabhadram

Tammineni Veerabhadram: బిజేపీ కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ తో కలసి ఉంటామన్నారు సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిసి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రకటించే వరకు ఏ ఏ స్థానాలకి పోటీ చేయడం అనేది ఇంకా పార్టీలో చర్చించలేదన్నారు. ఇప్పుడు కలసి ఉన్న ఎన్నికలలో కలసి పోటీ చేయాలనేది లేదన్నారు. బీజేపీ కి వ్యతిరేకంగా బీఆర్ ఎస్ తో స్నేహ పూర్వకంగా ఉందన్నారు. 20 ఏళ్ల లో ఒక్క పారిశ్రామిక సంస్థ వచ్చింది ఖమ్మం జిల్లాకి రాలేదన్నారు.. ఇండస్ట్రీ, వ్యవసాయ రంగం లో ఒక్క మంచి పధకం రాలేదని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా నాయకులు కలసి కట్టుగా మంచి అభివృద్ధి చేయాలని పిలుపు నిచ్చారు. ఖఃమ్మం జిల్లా అభివృద్ధి మీదనే మా ఉద్యమాలు వుంటాయన్నారు. ఎంఎల్‌ఏలు, మంత్రి సహకారాన్ని తీసుకుంటామన్నారు. సమాజానికి నష్టం జరిగే పార్టీ లకు మద్దతు ఇవ్వవద్దన్నారు. తప్పుడు సిద్ధాంతాల పార్టీకి వెళ్లద్దని సూచించారు. ఎం ఐ ఎం రాజకీయ అధికారం లోకి రాలేవన్నారు.

Read also: Actress Praveena: ఆ కీచకుడు నా కూతురి నగ్న ఫోటోలు లీక్ చేశాడు

దళిత బంధు పథకం నియోజకవర్గానికి 500 సరిపోవన్నారు. బీజేపీని రాజకీయ శత్రువునే కాదని, తెలంగాణ కు నష్టమన్నారు. ముస్లింలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. నూతన సంవత్సరం పేరుతో హడావుడి చేసిన నేతలు నాకు ఆప్తులే అన్నారు. కాంగ్రెస్, బీజేపీకి వెళ్తున్నారు అని ప్రచారం జరుగుతుందని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాను రాజకీయాలు కలుషితం చేసే నిర్ణయం తీసుకోవద్దన్నారు. మనుషులు మధ్య ధ్వేశాలు పెంచుతున్నారని అన్నారు. ప్రత్యర్థులు భారీ బహిరంగ సభలు పెట్టినా ఓర్వ లేకపోతున్నారని ఆరోపించారు.

Read also: A Journey To Kasi: సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సింది మనమే: శేఖర్ సూరి

గత సంప్రదాయలను కొనసాగిద్దామని, వీలైనంత మంచి చేద్దామన్నారు. పారిశ్రామికంగా మంచి యూనిట్ రాలేదని, అభివృద్ధి అంటే పరిశ్రమలు, వ్యవసాయమన్నారు. ఖమ్మం జిల్లా రాజకీయ నాయకులు పరిశ్రమలు, వ్యవసాయ అభివృద్ధి పై ఎందుకు మాట్లాడరన్నారు. చెప్పుకోదగ్గ ఇండస్ట్రీస్ రాలేదని తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఐదు సీట్లు గిరిజనులు.. ఇలాంటి జిల్లాలో ఎస్.టిలకు ఇచ్చిన ప్రాధాన్యత ఏది? అని ప్రశ్నించారు. పోడు భూములకు పట్టాలు ఏవరి ఆయన ప్రశ్నించారు. తలకాయ లేని ఆలోచనలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట విరుద్ధంగా చేస్తున్నారని మండిపడ్డారు. దళిత బంధు పథకం నియోజకవర్గం కి 500 సరిపోవన్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ధిపై దృష్టి సారిస్తామన్నారు. సిట్టింగ్ ఎంఎల్ఏ లు, మంత్రి సహకారంతో ముందుకు వెళ్తామన్నారు.
Love Marriage Tragedy: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కానీ రెండు రోజులకే..