దళిత బంధు పథకం నియోజకవర్గానికి 500 సరిపోవని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిసి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీని రాజకీయ శత్రువునే కాదని, తెలంగాణ కు నష్టమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అట్టహసంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు వివక్ష, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
గతంలో ఎవరైనా దళితుల అభివృద్ధి గురించి ఆలోచించారా అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. హైదరాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలో దళితబంధు లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రధాని మోదీ.. హైదరాబాద్ కార్పొరేటర్లను ఢిల్లీకి పిలిచి ఒట్టి చేతులతో పంపారని, నగర అభివృద్ధి కోసం నిధులిస్తే ప్రజలకు మేలు జరిగేదని విమర్శించారు. దళితుల సమగ్రాభివృద్ధి కోసమే ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఆర్ధికంగా ఎంతో వెనుకబడిన దళితులు అభివృద్ధి సాధించాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన…