Young Girl Commits Suicide In Medak After Husband Leaves Her: ప్రేమన్నాడు.. నువ్వు లేకుండా బ్రతకలేనన్నాడు.. పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. పాపం.. ఆ అమ్మాయి అతని మాయమాటల్లో పడి ప్రేమించింది. ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ.. పెళ్లయ్యాక అతడు తన నిజస్వరూపం బయటపెట్టాడు. రెండంటే రెండు రోజులకే ఆ అమ్మాయిని వదిలేశాడు. తమ కులాలు వేరు కాబట్టి, కలిసి జీవించడం కష్టమని చెప్పాడు. దీంతో ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. న్యాయం చేయమని వేడుకున్నా.. ఒక్కరు కూడా కనికరించకపోవడంతో పురుగుల మందు తాగి, ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ఉమ్మడి మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.
Towel Inside Stomach: షాకింగ్ ఘటన.. మహిళ కడుపులో టవల్‌ను వదిలేసి కుట్లేశారు..!
ఆ వివరాల్లోకి వెళ్తే.. తుప్రాన్ మండలపరిధిలోని ధర్మరాజ్‌పల్లి గ్రామానికి చెందిన యశ్వంత్‌రెడ్డి మూడు సంవత్సరాల క్రితం ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన బాషబోయిన తేజశ్రీ (18) వెంటపడ్డాడు. నువ్వు లేకుండా ఉండలేనని, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పడంతో.. తేజశ్రీ అతని ప్రేమని అంగీకరించింది. అలా మూడేళ్లు ప్రేమించుకున్న వీళ్లిద్దరు.. గతేడాది అక్టోబర్ 15వ తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. తామిద్దరం కాపురం చేసుకుంటామని.. అక్టోబర్ 19వ తేదీన పోలీస్ స్టేషన్‌లో ఒప్పుకున్నారు. అయితే.. ప్రేమించినప్పుడు అడ్డు రాని కులాల వ్యవహారాన్ని పెళ్లయ్యాక యశ్వంత్‌రెడ్డి లేవనెత్తాడు. ఇద్దరిది వేర్వేరు కులాలు కాబట్టి.. తాను కలిసి ఉండలేనంటూ యశ్వంత్ ఆ యువతిని వదిలి వెళ్లిపోయాడు.
Formula E Hyderabad: ఫిబ్రవరి 11న ఫార్ములా-ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్.. బుక్ మై షోలో టికెట్స్
భర్త వదిలేయడంతో కుంగిపోయిన తేజశ్రీ.. తనకు న్యాయం చేయమని కులపెద్దల్ని ఆశ్రయించింది. వాళ్లు ఆమెకి అండగా పెద్దఎత్తున నిరసనలు తెలిపారు. యశ్వంత్ తిరిగి కాపురానికి రావాలని నిలదీశారు. అయినా న్యాయం జరగలేదు. దీంతో తేజశ్రీ పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. నెలరోజులుగా చికిత్స పొందుతున్న తేజశ్రీ.. మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచింది. కుటుంబీకులు తేజశ్రీ మృతదేహాన్ని యశ్వంత్ ఇంటి వద్ద ఉంచి, ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో వాళ్లు ఆందోళన విరమించి, తేజశ్రీ అంత్యక్రియలు చేశారు.
Pineapple Juice: పైనాపిల్ జ్యూస్‌తో లాభాలే కాదు.. నష్టాలు కూడా!