గత నెల 30వ తేదీ నుంచి హైదరాబాద్‌లో ఆషాడ మాసం బోనాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే.. ఆషాడ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ఓల్డ్ సిటీ బోనాల ఉత్సవాల నిర్వహణపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా రెండు సంవత్సరాల పాటు బోనాలు నిర్వహించుకోలేక పోయామన్నారు. అయితే.. ఈ నెల 17 న సికింద్రాబాద్ మహంకాళి, 24 న ఓల్డ్ సిటీ బోనాలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.
Funerals : ఇదెక్కడి శవ పంచాయితీ..
అంతేకాకుండా 18న మహంకాళి అమ్మవారి అంబారీ ఊరేగింపు, 25 న ఉమ్మడి దేవాలయాల అంబారీ ఊరేగింపు, ప్రధాన దేవాలయాల వద్ద సాంస్కృతిక శాఖ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని వెల్లడించారు. చార్మినార్ వద్ద 500 మంది కళాకారులతో కళాప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. గతంలో కంటే అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు పోలీసు సిబ్బంది ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.