BJP Political War: రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కాయి. అటు బండి సంజయ్, ఇటు రాజాసింగ్ ఇళ్ల వద్ద పోలీసుల పహారా కట్టుదిట్టం చేశారు. ఈనేపథ్యంలో.. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా మండల కేంద్రాల్లో అరెస్టులు, నిర్బందాలపై నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి.
మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు రాజాసింగ్‌పై ముస్లీములు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాజాసింగ్ ను 24 గంటల్లో అదుపులో తీసుకోవాలని డిమాండ్ చేసారు. దీంతో పోలీసులు రాజాసింగ్ ను అదుపులో తీసుకున్నారు. అయితే అరెస్ట్ అనంతరం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కోర్టు బెయిల్ ఇవ్వడంతో.. మళ్లీ ఆగ్రహావేశానికి లోనైన నిరసన కారులు తెల్లవారు జామున ఓల్డ్ సిటీ హీటెక్కింది. నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. చార్మినార్ వద్ద ఓ వర్గం యువత భారీగా చేరుకుని పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేయడంతో వారు లాఠీఛార్జ్ చేశారు. శాలిబండ చౌరస్తాలో రాజాసింగ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. పోలీసులు పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకుని శాలిబండ పోలీస్టేషన్‌కు తరలించారు. పాతబస్తీలోని ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజాసింగ్‌కు బెయిల్ ఎందుకు ఇచ్చారని ఆందోళనకారులు మండిపడ్డారు.
ఓవైపు హైదరాబాద్‌లో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంటే.. కరీంనగర్ లోని ఇంటివద్ద టెన్షన్ మొదలైంది. బండిసంజయ్ పాదయాత్రపై ఉత్కంఠ నెలకొంది. పాదయాత్రకు పోలీసులు అనుమతించకపోవడంతో.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు దీక్షకు ఏర్పాట్లు బీజేపీ మొదలుపెట్టింది. దీంతో కరీంనగర్ జిల్లాలోని బండి సంజయ్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. బండిసంజయ్ ను హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో..రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి బీజేపీ శ్రేణులు కరీంనగర్ కు భారీగా తరలివస్తున్నారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా సంజయ్ ఇంటికి నలువైపులా పోలీసులు మెహరించారు. సంగ్రామ యాత్రపై కోర్టులో బీజేపీ శ్రేణులు లంచ్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. దీంతో.. కోర్టు ఆదేశాల పై ఉత్కంఠత నెలకొంది.
Legends League Cricket 2022: క్రికెట్ అభిమానులకు పండగ.. భారత్‌లోని ఐదు నగరాల్లో లెజెండ్స్ మ్యాచ్‌లు