Legends League Cricket 2022: క్రికెట్ అభిమానులకు పండగ.. భారత్‌లోని ఐదు నగరాల్లో లెజెండ్స్ మ్యాచ్‌లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Legends League Cricket 2022: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహామహులు మరోసారి మైదానంలోకి బరిలో దిగనున్నారు. వయసు మీద పడ్డా ఉత్సాహంతో క్రికెట్ ఆడి అభిమానులను అలరించనున్నారు. ఈ మేరకు లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్‌ఎల్‌సీ) రెండో సీజన్ షెడ్యూల్‌ను నిర్వాహకులు విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా ఈ టోర్నీ ఐదు నగరాల్లో జరగనుంది. లీగ్ మ్యాచ్‌లు కోల్‌కతా, ఢిల్లీ, కటక్, లక్నో, జోధ్‌పూర్ వేదికగా జరగనున్నాయి. . ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సెప్టెంబర్ 16న సెప్టెంబర్ 16న ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఓ ఛారిటీ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. ఇండియా మహరాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఇండియా మహరాజాస్ జట్టుకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సారథ్యం వహించనుండగా.. రెస్టాఫ్ వరల్డ్ జెయింట్స్‌ను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నడిపించనున్నాడు.
Read Also: Viral News: అక్కడ అబ్బాయి రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే..? లేదంటే జైలుకే..!
Also Read
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
కాగా ఇండియా మహరాజాస్ జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, యూసఫ్ పఠాన్, సుబ్రహ్మణ్యం బద్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్, స్టువర్ట్ బిన్నీ, శ్రీశాంత్, హర్భజన్ సింగ్, నమన్ ఓజా, అక్షశ్ దిండా, ప్రజ్ఞాన్ ఓజా, అజయ్ జడేజా, ఆర్పీ సింగ్, జోగీందర్ శర్మ, రితేందర్ సింగ్ సోధి ఉన్నారు. అటు సెప్టెంబర్ 17 నుంచి అసలు టోర్నీ ప్రారంభం కానుంది. కోల్‌కతా వేదికగా సెప్టెంబర్ 17 నుంచి 18 వరకు, లక్నో వేదికగా సెప్టెంబర్ 21 నుంచి 22 వరకు, ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 24 నుంచి 26 వరకు, కటక్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు, జోధ్‌పూర్ వేదికగా అక్టోబర్ 1 నుంచి 3 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్లే ఆఫ్ మ్యాచ్‌లు అక్టోబర్ 5 నుంచి 7 వరకు జరుగుతాయి. ఫైనల్ అక్టోబర్ 8న జరగనుంది.
తాజావార్తలు
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!