దేశంలోనే స్టార్టప్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా టీహబ్ మారిందనడంలో సందేహం లేదు. టీ హద్ ద్వారా ఎన్నో కొత్త కొత్త స్టార్టప్‌లు పురుడుపోసుకున్నాయి. అయితే.. రోజు రోజుకు పెరుగుతున్న స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ హబ్2ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే. వివిధ రంగాల్లో పెరుగుతున్న స్టార్టప్‌లకు ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెండో దశ టీ హబ్ నిర్మాణాన్ని చేపట్టింది. గచ్చిబౌలిలోని త్రిబుల్ ఐటీలో ఏర్పాటు చేసిన టీ హబ్‌లో స్టార్టప్‌లకు స్థలం సరిపోకపోవడంతో కొత్తగా విశాలమైన ప్రాంగణమైన మాదాపూర్-రాయిదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో 3.5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ హబ్2ను నిర్మించారు.
అయితే ఈ నేపథ్యంలో.. ప్రసుత్తం దీని నిర్మాణం పూర్తి కావడంతో వచ్చే నెలలో ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వచ్చిన తర్వాత టీహబ్-2 ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్నారు అధికారులు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమైన టీహబ్-2 ప్రపంచంలోనే అతి పెద్ద స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్‌గా మారనుంది. ఇక్కడ ఒకేసారి 1500 స్టార్టప్‌లు తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు అవసరమైన మౌలిక వసతులను, పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.