నూతన ఐటీ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. స్టార్టప్‌లకు రూ.25 లక్షల వరకు సీడ్ ఫండింగ్ చేస్తామని చెప్పారు. 2029 నాటికి రూ. 5 లక్షల వర్క్ స్టేషన్లు పెట్టనున్నట్లు తెలిపారు. అమరావతిలో డీప్ టెక్నాలజీ భవనం నిర్మాణం, యువత భవిష్యత్ అంతా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి నూతన టెక్నాలజీల పైనే ఉందని తెలిపారు. ప్రస్తుతం డీప్ టెక్నాలజీతో ఉత్పన్నమయ్యే అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం ఉండాలని సూచించారు.
Company Layoff : అమెరికా ఆధారిత ప్రాప్‌టెక్ స్టార్టప్ ఫ్రంట్ డెస్క్ ఈ ఏడాది ప్రారంభంలోనే భారీ తొలగింపులను ప్రకటించింది. గత మంగళవారం రెండు నిమిషాల వర్చువల్ కాల్ ద్వారా 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ తెలిపింది.
భారతదేశపు తదుపరి స్టార్టప్ పవర్‌హౌస్‌గా హైదరాబాద్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. భారతదేశంలోని మొదటి ఐదు స్టార్టప్ హబ్‌లలో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే టెక్ హబ్‌గా పేరున్న బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్, పుణె నగరాలు మన కంటే ముందున్నాయి.
డిపాజిటర్లు పెద్ద ఎత్తున నిధులను ఉపసంహరించుకోవడం దివాళా తీసి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ప్రభావం చాలా దేశాలపై పడుతోంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్‌వీబీ) మూసివేత పట్ల స్టార్టప్ సంస్థలు ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
Today (24-12-22) Business Headlines: శ్రీరామ్ ఆల్ ఇన్ ఒన్ ఆర్థిక సేవలు: శ్రీరాం ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్, శ్రీరాం సిటీ యూనియన్ విలీనమై శ్రీరాం ఫైనాన్స్ లిమిటెడ్ అనే కంపెనీగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కస్టమర్లు వివిధ లోన్ల కోసం వేర్వేరు శాఖలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపట్టారు. అన్ని బ్రాంచిల్లో అన్ని రకాల ఆర్థిక సేవలు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని సంస్థ ఎండీ అండ్ సీఈఓ వైఎస్ చక్రవర్తి వెల్లడించారు.
దేశంలోనే స్టార్టప్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా టీహబ్ మారిందనడంలో సందేహం లేదు. టీ హద్ ద్వారా ఎన్నో కొత్త కొత్త స్టార్టప్‌లు పురుడుపోసుకున్నాయి. అయితే.. రోజు రోజుకు పెరుగుతున్న స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ హబ్2ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే. వివిధ రంగాల్లో పెరుగుతున్న స్టార్టప్‌లకు ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెండో దశ టీ హబ్ నిర్మాణాన్ని చేపట్టింది. గచ్చిబౌలిలోని త్రిబుల్ ఐటీలో ఏర్పాటు చేసిన టీ హబ్‌లో స్టార్టప్‌లకు…