Suspension on CI: సిద్దిపేట జిల్లా చేర్యాల CI శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినదుకు సస్పెండ్ చేస్తూ సిద్దిపేట CP శ్వేతా ఉత్తర్వులు జారీ చేశారు. కొద్దిరోజుల క్రితం చేర్యాల ZPTC మల్లేశం హత్య జరిగిన రోజు CI శ్రీనివాస్ అందుబాటులో లేడు. అదే రోజు చేర్యాల పోలీస్ స్టేషన్ లో దాదాపు గంటన్నరకు పైగా CI రాక కోసం వేచి చూశారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. అయితే సీఐ ఎంతసేపటికి రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పని నిమిత్తం బయటకు వెళ్లారు అనుకున్న ఎమ్మెల్యే తరువాత ఆయన ఉన్నతాధికారుల అనుమతి లేకుండా తనపనులకై బయటకు వెళ్లినట్లు తేలడంతో మండిపడ్డారు. ఇదేనా సీఐ ప్రజలకు అందుబాటులో ఉండేది అంటూ ఉగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకే ఇంతగా వేచి చేసే పరిస్థితి నెలకొన్నప్పుడు ఇక ప్రజల పరిస్థి ఏంటని ప్రశ్నించారు.
Read also: MLAs poaching case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్
ఘటన జరిగినప్పుడు అందుబాటులో లేకపోవడంతో గతంలో మెమో జారీ చేశారు ఉన్నతాధికారులు. అయిన తీరు మార్చుకోకుండా గత నెల 24న ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పొరుగు ప్రాంతానికి వెళ్ళాడు CI శ్రీనివాస్. తిరుగు ప్రయాణంలో యాక్సిడెంట్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో CI తీరు మార్చుకొకపోవడంతో సస్పెండ్ చేశారు CP. చేర్యాల CI గా బాధ్యతలు చేపట్టి 9 నెలల్లోనే CI శ్రీనివాస్ సస్పెండ్ కావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
Asifabad Bus accident: బస్సునుంచి బయటకు దూకిన డ్రైవర్.. కారణం ఇదే..