తెలంగాణ హైకోర్టులో జడ్జీల సంఖ్య మరింత పెరగనుంది.. రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ఆరుగురు న్యాయవాదులను జడ్జీలుగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం.. ఆరుగురు న్యాయవాదులకు హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి కల్పించాలని సిఫార్సుల్లో పేర్కొంది సుప్రీంకోర్టు.. ఏనుగుల వెంకట వేణుగోపాల్, నేగేశ్ భీమపాక, నామవరపు రాజేశ్వరరావు, కాజా శరత్ , పుల్ల కార్తీక్, జగ్గన్నగారి శ్రీనివాసరావును పేర్లను కేంద్రానికి సిఫారసు చేసింది సుప్రీం కొలీజియం.. వాస్తవంగా తెలంగాణ హైకోర్టులో జడ్జీల 42 ఉండాలి.. ప్రస్తుతం 29 మంది జడ్జీలు ఉన్నారు.. అయితే, సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే.. జడ్జీల సంఖ్య పెరగనుంది.. కాగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. న్యాయవ్యవస్థ బలోపేతానికి.. జడ్జీల నియామకంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న విషయం తెలిసిందే.
