పోసాని ఇంటిపై రాళ్లదాడి.. బూతులు తిడుతూ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ దర్శకనిర్మాత, రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి ఇంటిపై రాళ్ల దాడికి దిగారు గుర్తుతెలియని వ్యక్తులు.. హైదరాబాద్ అమీర్‌పేట సమీపంలోని ఎల్లారెడ్డిగూడ నివాసం ఉంటున్నారు పోసాని.. అయితే, అర్ధరాత్రి ఆయన నివాసం దగ్గరకు వచ్చిన కొందరు దుండగులు.. పోసాని ఇంటిపై రాళ్లువిసిరారు.. పోసానిని బండ బూతులు తిడుతూ రెచ్చిపోయిన రాళ్ల దాడికి పూనుకున్నారు.. ఊహించన ఘటనతో వాచ్‌మన్ కుటుంబ సభ్యులు భయాందోళనకు దురయ్యారు.. అయితే, ఘటనా జరిగిన సమయంలో పోసానిగానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ అక్కడ లేనట్టుగా తెలుస్తుంది.
గత ఎనిమిది నెలలుగా మరోచోట ఉంటున్నారు పోసాని కుటుంబ సభ్యులు.. ఇక, ఈ ఘటనపై సంజీవరెడ్డి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వాచ్ మెన్.. రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.. పోసాని ఇంటి సమీపంలోని సీసీ ఫుటేజ్ పరిశీలించి ఆధారాలు సేకరించే పనిలో పడిపోయారు.. కాగా, గత మూడు రోజులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, పోసాని కృష్ణ మురళి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది… ఈ నేపథ్యంలో పోసాని ఇంటిపై దాడి జరగడం చర్చగా మారింది.. దుండగులు పోసాని ఇంట్లోనే ఉన్నాడని భావించి బూతులు తిడుతూ రాళ్లు విసిరారని చెబుతున్నారు ప్రత్యక్ష సాక్షులు.
Also Read
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!