Jagadish Reddy: త్వరలో టీఆర్ఎస్ లో భారీ వలసలు ఉంటాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజీనామా తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరింత అభివృద్ధి చెందాడని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 20న మునుగోడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఉంటుందని తెలిపారు. సభా వేదికగా బీజేపీ, టీస్ అభివృద్ధి సంక్షేమంపై ముఖ్యమంత్రి స్పందిస్తారని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ మాకు పోటీ కానే కాదని స్పష్టం చేసారు. మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని హర్షం వ్యక్తం చేసారు. దేశ రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వామపక్షాల మద్దతు మాకే ఉంటుంది అని భావిస్తున్నాని స్పష్టం చేసారు జగదీశ్‌రెడ్డి. త్వరలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు ఉంటాయని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి లేదు, ఆశావాహులు మాత్రం భారీగా ఉన్నారని తెలిపారు. గెలిచే పార్టీ కాబట్టి ఆశావాహులు ఉండడం సహజమని అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు. రాజీనామా తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరింత అభివృద్ధి చెందాడని జగదీశ్ రెడ్డి తెలిపారు. అలంపూర్ లో మంత్రి నిరంజన్ రెడ్డి మునిసిపల్ అధికారుల పై సీరియస్ అయ్యారు. అలంపూర్ లోని ఆలయాలను దక్షిణ కాశీగా పిలుస్తేనే సరిపోదు పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దాలని వార్నింగ్ ఇచ్చారు.
Also Read
సంవత్సరానికి పట్టణాన్ని నూతన పురోగతి చెయ్యాలని ఆదేశించారు. అలా చేస్తేనే భారతదేశం, క్షిణ కాశీ అయిన అలంపూర్ వైపు చూసే విధంగా ఉంటుందని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ కు పట్టణంలో ఎక్కడ ఒక ముళ్లచెట్టు లేకుండా 15 రోజుల్లో తొలగించాలని ఆదేశాలు జారీచేసారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉండే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. టైం బాండ్ పెట్టుకొని నెల లేక 45 రోజుల్లో పట్టణంలో ముళ్ళ చెట్లు మురికి గుంతలు లేకుండా అధికారుల సమన్వయంతో పూర్తి చేయాలని కలెక్టర్ కు ఆదేశించారు జగదీశ్ రెడ్డి. అన్ని పూర్తి అయితేనే పట్టణంలో తిరిగి అడుగుపెడతానని తెలిపారు.
తాజావార్తలు
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
-
OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
-
OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
-
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
-
Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!