సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. యువతీయువకులు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను దుర్వినియోగం చేసుకుంటున్నారు. తాజాగా ఓ యువతి మోసపోయి కేటుగాళ్ళ చేతిలో అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి కేసుకి సంబంధించిన వివరాలు మీడియాకు వివరించారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువతిపై అత్యాచారం చేశారు.
మంగళవారం సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతంలో డయల్ 100 కు కాల్ వచ్చింది. కాల్ వచ్చిన వెంటనే పరిధిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ టీం వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి యువతిని సేవ్ చేసి టోలిచౌకివాసి సాజిద్ ను అరెస్టు చేశాం. కేవలం ఒక రోజు పరిచయంతోనే యువతీ యువకులు గుడ్డిగా అపరిచిత వ్యక్తుల్ని నమ్ముతున్నారు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయమై వాట్సాప్ వీడియో కాల్ లో న్యూడ్ గా మాట్లాడినటువంటి వీడియోను రికార్డ్ చేసి యువతిని బ్లాక్ మెయిల్ చేశాడు సాజిద్. దీంతో సాజిద్ ని అరెస్ట్ చేశాం. ఎక్కువగా ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా 25 సంవత్సరాల లోపు యువతీ యువకులు మోసపోతున్నారు. న్యూడ్ గా కనిపించడం ఆ తర్వాత వీడియోగ్రఫీ చేసి డబ్బులు అడగడం లేదంటే బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతున్నాయన్నారు శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి. ఇలాంటి ఘటనలకు సంబంధించి రోజుకి ఒక్క కేసును అయిన నమోదు చేస్తున్నాం.
ఇలాంటి ఘటనల వల్ల తల్లిదండ్రులకు ఫ్రెండ్స్ కు చెప్పకపోవడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడినవారు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు ఎటు వెళ్తున్నారు అనే అంశానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. ఎక్కువ శాతం 20 సంవత్సరాల లోపు ఏజ్ ఉన్నటువంటి యువతులు ఇటువంటి ఘటనలు బారిన పడుతున్నారు. యువతీ యువకులు సోషల్ మీడియాని వాడేటప్పుడు ఇన్ స్టాగ్రామ్ ఫేస్ బుక్ ప్లాట్ ఫాంలలో అపరిచిత వ్యక్తులతో మాట్లాడవద్దని, సెన్సిటివ్ విషయాలు వారితో షేర్ చేసుకోవద్దన్నారు డీసీపీ.