AP Byelections 2025 Notification Released: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల నిర్వహణకు ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 3 ఎంపీటీసీలు, 2 జడ్పీటీసీలు, 2 పంచాయితీలకు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకూ నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. ఆగష్టు 5న మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఆగస్టు 10న, ఆగస్టు 12న పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేశారు.
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం మణీంద్రం, పల్నాడు జిల్లా కారెంపూడి మండలం వేపకంపల్లి, నెల్లూరు జిల్లా విడవలూరు మండలం విడవలూరు – 1 ఎంపీటీసీ స్ధానాలకు.. కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్ధానాలకు.. ప్రకాశం జిల్లా కొండపి గ్రామపంచాయతి సర్పంచ్, వార్డుమెంబర్‌లకు, తూర్పుగోదావరి జిల్లా కడియపులంక గ్రామపంచాయతి సర్పంచ్‌లకు ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇలాఖాలో ఆగస్టు 12న పోలింగ్ జరగనుంది. ఆరోజు పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉపఎన్నిక జరగనుంది.
Also Read: Vangalapudi Anitha: వైఎస్ జగన్ ఎవరిని టచ్ చేయకూడదో.. వాళ్లనే టచ్ చేశారు!
ఉప ఎన్నిక షెడ్యూల్ ఇదే:
# జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకూ నామినేషన్లు
# ఆగస్టు 5న మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణ గడువు
# ఆగష్టు 10న గ్రామ పంచాయితీలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఎన్నిక, అదేరోజు 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ
# ఆగస్టు 12న ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకూ ఎన్నికలు, 14న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ