తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. తుమ్మడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి రూ.35 వేల కోట్లు ఖర్చు అవుతుందని, 4.47 లక్షల ఎకరాలకు ఆయకట్టు అందుతుందని హరీష్ రావు చేసిన ప్రకటన అసత్యమని ఆయన స్పష్టం చేశారు.
పోలవరం కాఫర్ డ్యామ్ రెండోసారి కూలలేదా?.. కాంగ్రెస్, బీజేపీకి పోలవరాన్ని కూలవరం అనే దమ్ముందా? అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాళేశ్వరం విషయంలో ఒక విధానం, పోలవరం విషయంలో మరో విధానమా? అని ప్రశ్నించారు.. పోలవరం కాఫర్ డ్యామ్‌పై ఎన్‌డీఎస్ఏ మౌనం ఎందుకు? అని నిలదీశారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు.
CM Revanth Reddy : సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (SLIP) సవరించిన అంచనాలకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్ట్ అంచనాలు రూ. 13,058 కోట్ల నుండి రూ. 19,325 కోట్లకు పెరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , మంత్రివర్గ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. Leopard : గోల్కొండ మిలిటరీ ప్రాంతంలో చిరుత సంచారం.. మంత్రి తుమ్మల మాట్లాడుతూ,…
తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ల కంటే సమర్థవంతంగా పని చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కృష్ణా నదీ జలాలపై ప్రగతి భవన్‌లో తెలంగాణ నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని.. బీఆర్ఎస్ వాదనలో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో చెప్తామన్నారు. మిగులు జలాల వాడకం కోసం ఎస్ఎల్బీసీ టన్నెల్, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి, కోయిల్ సాగర్…
కాళేశ్వరం కుంగుబాటుపై ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన నివేదికపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం సెక్రటేరియట్ లో మంత్రి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో వికృత, వికార మైన విధానాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.జ్యుడీషియల్ కమిషన్ విచారణలో భాగంగా కేసీఆర్, హరీష్ కు నోటీసులు పంపిస్తే తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వారి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు..
కేటీఆర్ వ్యాఖ్యలు పిటిషన్ గా తీసుకొని సీబీఐ విచారణ చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో బాంబులు పెట్టారని కేటీఆర్ అంటున్నారని.. కేటీఆర్ అడుగుతున్నట్టు కాళేశ్వరంలో బాంబులు పెట్టినట్టు అయితే కేటీఆర్ వ్యాఖ్యలు పిటిషన్ గా తీసుకొని సీబీఐతో విచారణ చేయించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు తెలిపారు. హనుమకొండ జిల్లా ములకనూరులో మంత్రి మాట్లాడారు.
CM Revanth Reddy : రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాబోయే రెండేండ్లలో.. 2027 జూన్ నాటికి రాష్ట్రంలో కృష్ణా పై అసంపూర్తిగా ఉన్న సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా నిర్ణీత గడువుతో పాటు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని చెప్పారు. తక్కువ ఖర్చుతో పూర్తి అయ్యే ప్రాజెక్టుల పనులను వేగంగా చేపట్టాలని సూచించారు. కృష్ణా…
Palla Rajeshwar Reddy : జనగామ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “దేవాదుల ఫేజ్ 1, ఫేజ్ 2 ప్రాజెక్టును పూర్తిచేసి, ఫేజ్ 3లో మూడు మోటర్లతో 1800 క్యూసెక్కుల నీటి సరఫరా కోసం ఏర్పాట్లు చేసింది కేసీఆర్ ప్రభుత్వం” అని తెలిపారు. అయితే,…
హనుమకొండ జిల్లా ధర్మసాగర్లో జరిగిన కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రాజకీయ వేదికగా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే రాజయ్య, ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా అజయ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాదుల ప్రాజెక్టు, కాలేశ్వరం ప్రాజెక్టుల నిర్వహణపై తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ, దేవాదుల ప్రాజెక్టుపై అవగాహన లేకుండా కొంతమంది పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు తనదే రూపకల్పన అని, దీన్ని…