Singireddy Niranjanreddy : వానాకాలం సాగు ప్రణాళికపై సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వానాకాలం సాగు ప్రణాళికపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కోటి 42 లక్షల ఎకరాలలో వానాకాలం సాగు జరిగే అవకాశం ఉందన్నారు. 70 నుండి 75 లక్షల ఎకరాలలో పత్తి పంట సాగు, 50 లక్షల ఎకరాలలో వరి, 15 లక్షల ఎకరాలలో కంది, 11.5 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటలు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. గత ఏడాది పత్తి వేయకుండా రైతులు నష్టపోయారని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది రైతులను ఆ దిశగా ప్రోత్సహించాలని, రాష్ట్రంలో 1332 పత్తి ఎక్కువ సాగు చేసే క్లస్టర్లు, వెయ్యికి పైగా వరి సాగు చేసే క్లస్టర్లు, 82 కంది సాగు చేసే క్లస్టర్లను గుర్తించామని ఆయన పేర్కొన్నారు. క్లస్టర్ల వారీగా పంట ప్రణాళికలు సిద్దం చేశామని, ఆయా పంటలకు కావాల్సిన విత్తనాలను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పచ్చి రొట్ట ఎరువులను ప్రోత్సహించి భూసారం పెంచే దిశగా రైతులను సన్నద్దం చేయాలని, మే నెలలో వీటిని రైతులకు పంపిణీ చేయాలన్నారు. కల్తీలేని నాణ్యమైన విత్తనాల సరఫరాకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కల్తీని నిరోధించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించాలన్నారు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని, పంటల ప్రణాళిక ప్రకారం ఎరువులను సిద్దంగా ఉంచాలన్నారు. మే నెలాఖరు నాటికి 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. రష్యా – ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో అన్ని ఎరువులు ముందస్తుగా అందుబాటులో ఉండేలా చూడాలని, దీనికి సంబంధించి మార్క్ ఫెడ్, వ్యవసాయ శాఖ తక్షణం చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. మే నెలలో క్షేత్రస్థాయిలో పర్యటించి వానాకాలం పంటల ప్రణాళికపై క్లస్టర్ల వారీగా రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. పంటల ప్రణాళికపై జిల్లాల వారీగా ఏఈఓలకు శిక్షణ కల్పించాలన్నారు.
ఆయిల్ పామ్ సాగు కోసం వ్యవసాయ – ఉద్యాన అధికారులు సమన్వయంతో ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషిచేయాలని, దీని కోసం వ్యవసాయ – ఉద్యాన అధికారులతో ఉమ్మడి సమావేశం నిర్వహించాలన్నారు. రైతు వేదికలను అవగాహన కోసం కోసం విరివిగా ఉపయోగించుకోవాలని, రైతుబంధు సమితులకు భాగస్వామ్యం కల్పించాలన్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!