రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు నవంబర్ 3 నుంచి ప్రారంభం కానుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి వాట్సాప్ నంబర్ 7337359375 కు “HI” అనే సందేశం పంపి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని మంత్రి వివరించారు. 2025–26 ఖరీఫ్ పంట సీజన్‌లో 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 3,013 రైతు సేవా కేంద్రాలు,…
Minister Thummala: తెలంగాణలో ఖమ్మం జిల్లాతో సహా పలు ప్రాంతాల్లో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పరిగణలోకి తీసుకున్నారు. ఖరీఫ్ సీజన్లో గరిష్టంగా డిమాండ్ ఉంటుందంటూ కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. సీఎం విజ్ఞప్తిని స్వీకరించిన కేంద్ర మంత్రి.. తెలంగాణ రాష్ట్ర రైతుల డిమాండ్ ను నెరవేర్చే దిశగా ఆదేశాలు జారీ చేశారు. అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా ఉండేలా చూసుకోవాలని ఎరువుల శాఖ అధికారులను ఆదేశించారు.
Thummala Nageswara Rao: తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని యూరియా కొరతపై కేంద్ర ప్రభుత్వానికి మళ్లీ లేఖ రాశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో యూరియా డిమాండ్ పెరుగుతున్నదని, అయినా సరఫరాలో తీవ్ర లోటు ఉందని మంత్రి తన లేఖలో స్పష్టం చేశారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకుగాను కేంద్రం రాష్ట్రానికి 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కోటా కేటాయించినప్పటికీ.. ఇప్పటి వరకు కేవలం 3.06…
Weather Updates : తెలంగాణ ప్రజల నిరీక్షణకు తెరపడింది.. ఎప్పటిలా కాకుండా, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రెండు వారాల ముందే పలకరించాయి, జూన్ చివరి వారంలోనే రాష్ట్రవ్యాప్తంగా తొలకరి జల్లులతో స్వాగతం పలికాయి. ఇది కేవలం వాతావరణ మార్పు కాదు, రైతన్నల ముఖాల్లో చిరునవ్వు, బీడు భూములకు జీవం, నగరవాసులకు ఉపశమనం.. సాధారణంగా జూన్ రెండో వారంలో మొదలయ్యే రుతుపవనాలు, ఈసారి కాస్త తొందరగానే తెలంగాణ గడ్డను తాకాయి. దీనికి కారణం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.…
Monsoon : తెలంగాణలో వర్షాకాలం త్వరితగతిన ప్రారంభమవుతోంది. సాధారణంగా జూన్ రెండో వారంలో రాష్ట్రంలో ప్రవేశించాల్సిన నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon), ఈసారి అంచనా వేసిన సమయానికంటే ముందుగానే రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవేశించాయి. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, ఈసారి నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతూ, రెండు రోజుల వ్యవధిలో రాష్ట్రం మొత్తం మీద విస్తరించే అవకాశముంది. ఈ పరిణామం రైతులకు ఉత్సాహాన్నివ్వడమే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి లభ్యత, నీటి వనరుల నిల్వ, పౌర…
Nadendla Manohar : ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు చెల్లించాల్సిన బకాయిలను విస్మరించారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. రైతుల సంక్షేమానికి ఎన్డీయే ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ, అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1,674 కోట్ల మేర బకాయిలను వెంటనే చెల్లించామని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో 5.65 లక్షల మంది రైతుల నుంచి 35.94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.…
ఎరువుల ధరలను పెంచకూడదని కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయించింది. జూన్-సెప్టెంబర్ ఖరీఫ్ లేదా వేసవి సీజన్ కోసం రూ.1.08 లక్షల కోట్ల పంట-పోషక సబ్సిడీని ఆమోదించిందని కేంద్ర ఆరోగ్య, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మీడియా సమావేశంలో తెలిపారు. దేశంలో యూరియాతో సహా అన్ని కీలక ఎరువుల కోసం తగినంత నిల్వలు, ఏర్పాట్లు ఉన్నాయని మంత్రి తెలిపారు.
Declining Rice Production: దేశంలో ఈ ఏడాది వరి ఉత్పత్తి తగ్గవచ్చని తెలుస్తోంది. అయితే ఈ సారి దేశంలో 12 మిలియన్ టన్నుల మేర వరి ఉత్పత్తి తగ్గవచ్చని కేంద్ర ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే వెల్లడించారు. కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు తక్కవగా కురవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే దేశంలో ఇప్పటి వరకు వరి స్టాక్ మిగులు ఉందని వెల్లడించారు.
వానాకాలం సాగు ప్రణాళికపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కోటి 42 లక్షల ఎకరాలలో వానాకాలం సాగు జరిగే అవకాశం ఉందన్నారు. 70 నుండి 75 లక్షల ఎకరాలలో పత్తి పంట సాగు, 50 లక్షల ఎకరాలలో వరి, 15 లక్షల ఎకరాలలో కంది, 11.5 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటలు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. గత ఏడాది పత్తి వేయకుండా రైతులు నష్టపోయారని…