Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వ కృషి ఫలించింది.. సింగరేణికి ‘తాడిచర్ల-2’ బొగ్గు బ్లాక్..
- సింగరేణికి కేంద్రం బొగ్గు బ్లాక్ కేటాయింపు
- ప్రజా ప్రభుత్వ కృషి ఫలించిందన్న భట్టి
- 40 ఏళ్ల బొగ్గు ఉత్పత్తికి మార్గం
- వేల మందికి ఉద్యోగాలపై ఆశలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి సంస్థ మనుగడ, అభివృద్ధి కోసం చేసిన నిర్విరామ కృషి ఫలించింది. సింగరేణి సంస్థకు ఊపిరిపోసేలా ‘తాడిచర్ల-2’ బొగ్గు బ్లాక్‌ను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేటాయింపు పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, తాను కలిసి కేంద్రంపై తెచ్చిన ఒత్తిడి వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఈ బ్లాక్ కేటాయింపునకు అంగీకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర బొగ్గు , గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
గనుల సాధనకై ప్రజా ప్రభుత్వ నిరంతర పోరాటం
తాడిచర్ల-2 బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాలని కోరుతూ తాము చేసిన సుదీర్ఘ ప్రయత్నాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. మార్చి 2024లో న్యూఢిల్లీలో అప్పటి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి విజ్ఞప్తి చేశామని, ఆ తర్వాత హైదరాబాద్ వేదికగా జరిగిన బొగ్గు బ్లాక్‌ల వేలంలో ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి వివరించామని తెలిపారు. అనంతరం నవంబరు 2024లో, అలాగే ఇటీవలి మే నెల ఢిల్లీ పర్యటనలో కూడా కేంద్ర బొగ్గు శాఖపై ఒత్తిడి తెచ్చామన్నారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రధాని మోదీని కలిసి తాడిచర్లతో పాటు ఇతర బొగ్గు బ్లాక్‌లను సింగరేణికి ఇవ్వాలని కోరారన్నారు. గత ప్రభుత్వ హయాంలో మూలనపడిన ఒడిశా ‘నైనీ’ బొగ్గు బ్లాక్‌కు ప్రత్యేక చొరవతో అన్ని అనుమతులు సాధించి, ఉత్పత్తి ప్రారంభించామని, ఇప్పుడు తాడిచర్ల-2 సాధించడమే తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని స్పష్టం చేశారు.
Also Read
- Rain Alert: మళ్లీ వర్షాల జోరు.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులతో భారీ వర్షాలు!
- Ramnagar Stampede: రాంనగర్ గణేష్ ఆగమన్ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో యువకుడు మృతి
- KCR: నేడు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం
- OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
సింగరేణికి వరంగా మారనున్న తాడిచర్ల-2 గని
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న తాడిచర్ల ఓపెన్ కాస్టు-2 గని సింగరేణి భవిష్యత్తుకు ఒక వరంగా మారనుంది. ఈ గనిలో మొత్తం 434.14 మిలియన్ టన్నుల నిల్వలు ఉండగా, అందులో దాదాపు 340 మిలియన్ టన్నుల మేలైన ‘జీ-9’ రకం బొగ్గును వెలికితీసే అవకాశం ఉంది. ఇక్కడి నుండి ఏడాదికి 10 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలనే ప్రణాళికలతో సింగరేణి సంస్థకు మరో 40 సంవత్సరాల పాటు నిరంతరాయంగా మైనింగ్ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇది సింగరేణి వార్షిక లక్ష్యమైన 100 మిలియన్ టన్నుల ఉత్పత్తిని చేరుకోవడానికి ఎంతగానో దోహదపడుతుంది. ఈ కొత్త ప్రాజెక్ట్ ద్వారా స్థానికంగా ప్రత్యక్షంగా , పరోక్షంగా సుమారు 3,000 మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ప్రాంతీయ అభివృద్ధి.. విద్యుత్ రంగానికి భరోసా
ఈ కొత్త గని ఏర్పాటుతో భూపాలపల్లి ప్రాంత సామాజిక, ఆర్థిక చిత్రపటం పూర్తిగా మారిపోనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. మైనింగ్ అవసరాల కోసం ఇక్కడ రైలు, రోడ్డు నెట్‌వర్క్‌తో పాటు ఇతర మౌలిక వసతులు భారీగా అభివృద్ధి చెందుతాయన్నారు. అన్నింటికీ మించి, రాష్ట్ర పారిశ్రామిక రంగానికి , విద్యుత్ ప్రాజెక్టులకు దీర్ఘకాలికంగా ఎలాంటి అంతరాయం లేకుండా బొగ్గు సరఫరా జరిగేలా ఈ తాడిచర్ల-2 బ్లాక్ గట్టి భరోసానిస్తుందని ఆయన పేర్కొన్నారు. సింగరేణి పరిధిలోని ఇతర బొగ్గు బ్లాకులను కూడా సంస్థకే కేటాయించాలని ఈ సందర్భంగా ఆయన కేంద్రాన్ని కోరారు.
తాజావార్తలు
-
Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
-
Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ దూకుడు..
-
Tilak vs Vaibhav: ఏంటిది వైస్ కెప్టెన్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన తిలక్ వర్మ.. వీడియో వైరల్!
-
Mahatma Gandhi: గాంధీగా మారిన మనోజ్ బాజ్‌పేయి.. ఆ 21 రోజుల కథతో వస్తున్న కొత్త సినిమా!
-
Rain Alert: మళ్లీ వర్షాల జోరు.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులతో భారీ వర్షాలు!
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!