Tilak vs Vaibhav: ఏంటిది వైస్ కెప్టెన్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన తిలక్ వర్మ.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tilak Varma Sledges Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ సందర్భంగా టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. సౌత్ జోన్‌తో జరుగుతున్న ఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్.. 44 పరుగులతో ఆకట్టుకున్నాడు. అర్ధ శతకానికి చేరువలో ఉన్న సమయంలో ఔట్ అయ్యాడు. అవుట్ అయ్యే కొద్దిసేపటికి ముందు ప్రత్యర్థి కెప్టెన్ తిలక్ వర్మతో జరిగిన ఓ సరదా ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైభవ్ సూర్యవంశీ ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించాడు. భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లోనూ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ.. వైభవ్‌ను స్లెడ్జ్ చేశాడు. ‘క్యా యార్ యే వైస్ కెప్టెన్?’ (ఏంటిది వైస్ కెప్టెన్) అంటూ తిలక్ వ్యాఖ్యానించడం వీడియోలో వినిపించింది. అయితే తిలక్ చేసిన ఈ వ్యాఖ్యలను బుడ్డోడు పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే తిలక్, వైభవ్ ఇద్దరూ నవ్వుతూ కనిపించారు. కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 15 ఏళ్ల యువ బ్యాటర్‌ను తిలక్ ఇలా స్లెడ్జ్ చేయడంపై కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
- Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
- ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
- India vs Pakistan: "అసలు మజా అప్పుడే".. దాయాదుల మధ్య పసిడి పోరు..
వైభవ్ సూర్యవంశీ అర్ధ శతకాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. 44 పరుగులు చేసిన అతడిని చమా వి. మిలింద్ పెవిలియన్‌కు పంపించాడు. వైభవ్ తన ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. వైభవ్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన అభిమన్యు ఈశ్వరన్ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 86 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 72 పరుగులు చేశాడు. అయితే దూకుడుగా ఆడే ప్రయత్నంలో రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇక దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లోనూ వైభవ్ రికార్డు సృష్టించాడు. 57 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి.. దులీప్ ట్రోఫీలో అర్ధ శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన బ్యాటర్‌గా నిలిచాడు. అదే మ్యాచ్‌లో సెంచరీకి చేరువగా వెళ్లిన వైభవ్.. 81 బంతుల్లో 92 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 42 బంతుల్లో 40 పరుగులు చేశాడు.
Tilak Verma vs Vaibhav Suryavanshi. pic.twitter.com/YIDfgF0qps
— Ishan’s Fan (@Ishanworld32) September 6, 2026
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?