Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
- ఢిల్లీలోని సత్య నికేతన్‌లో కుప్పకూలిని భవనం..
- భవనంలో పీజీ హాస్టల్ నిర్వహిస్తున్నట్లు సమాచారం..
- ఆదివారం కావడంతో విద్యార్థులు భవనంలో ఉన్నట్లు అనుమానం..
- కనీసం 50 మంది విద్యార్థులు చిక్కుపోయినట్లు ప్రత్యక్ష సాక్షుల వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Building Collapse: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. నైరుతి ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో 4 అంతస్తులు భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవనం కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఇద్దరిని రెస్క్యూ చేసి రక్షించినట్లు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అనిల్ శర్మ తెలిపారు.
ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. కూలిపోయిన భవనంలో పెయింగ్ గెస్ట్(పీజీ) హాస్టల్ ఉన్నట్లు తెలుస్తోంది. సత్య నికేతన్ ప్రాంతం ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలో ఉండటంతో ఇక్కడ పెద్ద సంఖ్యలో విద్యార్థులు నివసిస్తుంటారు. భవనం కూలిన సమయంలో లోపల సుమారు 50 మంది విద్యార్థులు ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు.
Also Read
- DU Student Harassment: ‘అర్బన్ మైండ్‌సెట్’ టీ-షర్ట్‌పై కామెంట్స్. DU విద్యార్థినిని SUVతో వెంబడించిన యువకులు
- Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
- CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
- AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
భవనం కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకువచ్చేందుకు జేసీబీలు,12 ఫైర్ ఇంజన్లు వాడుతున్నారు. ఆదివారం కావడంతో చాలా మంది విద్యార్థులు భవనంలోనే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. శిథిలా కింద నుంచి సహాయం కోసం కేకలు వినిపిస్తున్నట్లు అక్కడున్న వారు చెబుతున్నారు. కొందరు విద్యార్థులు భనవం కింద నుంచి ఫోన్లు చేస్తున్నారని శిథిలాల కింద చిక్కకుపోయి ఉండొచ్చని ఎమ్మెల్యే అనిల్ శర్మ చెప్పారు. భవనం ఎందుకు కూలిపోయిందనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతానికి అధికారులు సహాయక చర్యలపైనే దృష్టి కేంద్రీకరించారు.
తాజావార్తలు
-
Satya Master: “నాలుగు ఎలుకల కోసం మ్యాన్షన్నే తగలబెడతారా?” జానీ మాస్టర్ భార్యపై సత్య మాస్టర్ సంచలన కామెంట్స్!
-
Chiranjeevi: చిరూ లీక్స్ మెగా జోష్.. కాకా షూటింగ్ గురించి మాస్ లీక్ ఇచ్చిన మెగాస్టార్!
-
TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
-
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
-
TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?