Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ దూకుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైభవ్ సూర్యవంశీ అతి చిన్న వయసులోనే తన అద్భుత బ్యాటింగ్‌తో భారత క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 15 ఏళ్ల ఈ యువ సంచలనం ఎంత పెద్ద మ్యాచ్ అయినా ఒత్తిడికి లోనుకాకుండా తన సహజ సిద్ధమైన శైలిలోనే ఆడుతుంటాడు. నేడు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున సూర్యవంశీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగుల వ్యవధిలో అర్థశతకాన్ని చేజార్చుకున్నప్పటికీ, 37 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 44 పరుగులు చేసి వేగవంతమైన ప్రారంభాన్ని అందించాడు. చామ వి మిలింద్ వేసిన 15వ ఓవర్లో అతడు అవుట్ కాగా, అభిమన్యు ఈశ్వరన్ (72) తో కలిసి మొదటి వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
2026 నాకౌట్ మ్యాచ్‌ల్లో వైభవ్ సూర్యవంశీకి ఇది ఎనిమిదోసారి 40కి పైగా పరుగులు సాధించడం విశేషం. ఈ సంవత్సరంలో ఆడిన 8 నాకౌట్ ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలతో కలిపి మొత్తం 706 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు. అండర్-19 వరల్డ్ కప్ సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్‌పై 33 బంతుల్లో 68 పరుగులు చేసిన అతడు, ఫైనల్లో ఇంగ్లండ్‌పై కేవలం 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లతో 175 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ సాయంతో భారత్ 411/9 పరుగులు చేసి 100 పరుగుల తేడాతో ఛాంపియన్‌గా నిలిచింది.
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ వరుసగా రెండు నాకౌట్ మ్యాచ్‌ల్లో సెంచరీకి చేరువగా వచ్చి సూర్యవంశీ తృటిలో మిస్ చేసుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 29 బంతుల్లో 97 పరుగులు, క్వాలిఫైయర్-2లో గుజరాత్ టైటాన్స్‌పై 47 బంతుల్లో 96 పరుగులు చేశాడు. అంతేకాక, శ్రీలంక ఏ తో జరిగిన వన్డే సిరీస్ ఫైనల్లో 20 బంతుల్లోనే 94 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సెంట్రల్ జోన్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 92, రెండో ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేసి దులీప్ ట్రోఫీ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడిగా హాఫ్ సెంచరీ చేసిన లక్ష్మణ్ సింగ్ 57 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. తాజాగా ఫైనల్లోనూ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?