OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్‌లో ఇకపై క్రమశిక్షణ కఠినంగా ఉండబోతోందా..? గీత దాటితే ఎంతటివారిపై అయినా వేటు తప్పదా..? కొండా సురేఖ, చిన్నారెడ్డిలను తప్పించడం అందులో భాగమేనా..? ఫ్యూచర్లో ఎవరు హద్దు మీరినా ఇలాగే చర్యలు ఉండబోతున్నాయని క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చేసినట్టేనా..? లెట్స్ వాచ్. కాంగ్రెస్‌లో కయ్యాలు చాలా ఎక్కువ. ఎవరు ఏం మాట్లాడతారు..? ఏ నాయకుడు ఎలా స్పందిస్తాడో..? చెప్పడం చాలా కష్టం. అదేమంటే అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు. కానీ ఆ పేరుతో జరిగే రచ్చ అల్టిమేట్‌గా పార్టీకే చెడ్డ పేరు తీసుకొస్తుందనే మాట ఎప్పట్నుంచో ఉంది. అయినప్పటికీ ఎవరూ లెక్కచేయరు. అన్ని పార్టీల్లో ఉన్నట్టుగా కఠిన క్రమశిక్షణ కాంగ్రెస్‌లో మచ్చుకైనా కనిపించదు. ఆ పరిస్థితిని మార్చాలనుకుంటున్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అన్నింటికంటే ముందుగా నాయకులకు డిసిప్లిన్ అలవాటు చేయాలనుకుంటున్నారట. క్రమశిక్షణ తప్పి ప్రవర్తించే నేతలకు కర్రు కాల్చి వాత పెట్టాలనుకుంటున్నారట. పార్టీ లైన్ దాటితే ముందు వెనకా చూసేది లేదు… గీత దాటితే వేటు తప్పదు. అనేది స్పష్టం చేయాలని ఢిల్లీలోనే డిసైడ్ అయ్యారట ముఖ్యమంత్రి. దాంట్లో భాగమే మంత్రి కొండా సురేఖ బర్తరఫ్. ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డికి ఉద్వాసన అని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కార్యాలయమైన గాంధీభవన్… ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. గాంధీభవన్ కొద్ది రోజులుగా పార్టీ నాయకుల ధర్నాలు, నిరసనలకు వేదికగా మారిపోయింది. చిన్నా.. పెద్దా.. తేడాలేమీ లేవు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. పార్టీ నేతలు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. వీటన్నింటికి చెక్ పెట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. కేబినెట్ నుంచి మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయడమే కాదు… చిన్నారెడ్డి లాంటి సీనియర్ నేత నోరు జారారని వేటు వేశారు.
ఈ ఇద్దరి విషయంలో సీనియారిటీ, సిన్సియారిటీ లాంటి అంశాలను కూడా పట్టించుకోలేదు. వీరిద్దరి వంకతో పార్టీ నేతలందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. కొండా సురేఖ బీసీ. అయినా సరే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని డిసైడ్ అయ్యారట సీఎం. పార్టీలో అంతర్గత క్రమశిక్షణకు, సామాజికవర్గాలకు సంబంధం ఏంటనే వాదన చర్చ ఇప్పుడు కాంగ్రెస్‌లో జరుగుతోందట. నిజానికి కాంగ్రెస్‌లో వేచి చూసే ధోరణి ఎక్కువ. విషయాలను నాన్చే అలవాటు ఉంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం క్రమశిక్షణకే పెద్ద పీట వేయాలనే నిర్ణయానికి వచ్చారట. అందుకే పార్టీ అధిష్టానంపైనా ఒత్తిడి పెంచారనే మాటలు గాంధీభవన్‌లో వినిపిస్తున్నాయి. సీనియర్ నేత చిన్నారెడ్డి… రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అయినప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోవడం ద్వారా ఎంతటివారైనా సరే నోరు జారితే చర్యలు తప్పవనే ఇండికేషన్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రధాన సమస్య క్రమశిక్షణ లేకపోవడమే. ఏ నాయకుడూ దానికి మినహాయింపు కాదు. ఏదో ఒక సందర్భంలో క్రమశిక్షణ తప్పి వ్యవహరించినవారే. అయితే గతంలో మాదిరిగా వ్యవహరించడం ఇప్పుడు కుదరదు. ఎవరు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినా వేటు తప్పదనే విషయాన్ని కొండా సురేఖ, చిన్నారెడ్డి ఉదంతాలతో స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. వారి భుజాలపై తుపాకీ పెట్టి మిగతావారిని లైన్లో పెట్టేందుకు గట్టి స్ట్రోక్ ఇచ్చారు. ఏకంగా ఓ మంత్రిని, పార్టీకి అత్యంత లాయలిస్ట్ అయిన ఓ సీనియర్ నాయకుడిని కూడా తప్పించారంటే మిగతావారు కూడా అటెన్షన్లో ఉండాల్సిందే. పద్దతి మార్చుకోవాల్సిందే. లేకపోతే వారికి కూడా అదే ట్రీట్మెంట్ వర్తిస్తుందనేది చెప్పడమే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆలోచనగా కనబడుతోంది. సమస్యలుంటే పార్టీ వేదికలపై మాట్లాడాలి తప్పితే… రచ్చకెక్కితే కఠిన చర్యలుంటాయని నాయకులందరికీ ఇప్పటికే మెసేజ్ అందిందనే చర్చ కాంగ్రెస్‌లో మొదలైంది.
Also Read
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
- OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
- OTR: పటాన్చెరు కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
- Tags
- congress
- NTV Telugu
- OTR
తాజావార్తలు
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!