Ramnagar Stampede: రాంనగర్ గణేష్ ఆగమన్ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో యువకుడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramnagar Stampede: హైదరాబాద్‌లోని రాంనగర్ చౌరస్తాలో నిర్వహించిన గణేష్ ఆగమన్ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. వేలాది మంది యువకులు తరలివచ్చిన ఈ ర్యాలీలో తొక్కిసలాట జరగడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. డీజే చప్పుళ్ల మధ్య యువకులు డ్యాన్స్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో రాంనగర్ చౌరస్తాలో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీ గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుడి ఆగమనం సందర్భంగా భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో యువకులు హాజరయ్యారు. ఈ క్రమంలో రద్దీ ఎక్కువ కావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో కిందపడిన ఓ యువకుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
మృతుడిని బద్రీనాథ్ (19)గా గుర్తించారు. ఆయన అబిడ్స్‌లోని మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో బీటెక్ చదువుతున్నట్లు అధికారులు తెలిపారు. రాంనగర్‌లోని గౌరీ శంకర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న బద్రీనాథ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కడపగా గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కాసేపట్లో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు సమాచారం. భారీ సంఖ్యలో యువత తరలివచ్చిన గణేష్ ఆగమన్ ర్యాలీలో ఊహించని విధంగా తొక్కిసలాట జరగడం, ఓ యువకుడు మృతి చెందడంతో విషాదం నెలకొంది.
Also Read
- In Service Teachers TET: బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1న మరో టెట్ నోటిఫికేషన్..
- 22A Registrations: తెలంగాణలో 22-A ఆస్తుల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్.. కానీ షరతులు వర్తిస్తాయ్..
- New Bus Stands: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో మరో 13 కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
- TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘10 సెకన్ల రీల్ చాలు.. మీ ఇమేజ్ మారిపోతుంది’’.. పార్టీ నేతలకు అఖిలేష్ వార్నింగ్
-
Putin: ఐరోపాతో ఘర్షణ కోరడం లేదు.. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమేనన్న పుతిన్
-
Maharashtra: మహారాష్ట్రలో కరవు ఛాయలు.. 265 తాలూకాలు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటన
-
Jr NTR: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గాయం తర్వాత ఫస్ట్ టైం రాజమౌళి కొడుకు కోసం పబ్లిక్‌లోకి ఎన్టీఆర్!
-
Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?