Protocol issues: సిద్దిపేట జిల్లా దుబ్బాకకు వెళ్లిన మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటనలో ప్రోటోకాల్ రచ్చ చెలరేగింది. దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటోను ఫ్లెక్సీలో చిన్నగా వేశారని గులాబీ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలు చేశారు. మరోవైపు, హస్తం పార్టీ నేతలకు పోటీగా కొత్త ప్రభాకర్ రెడ్డి జిందాబాద్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు.
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
మరోవైపు, ఎటువంటి ప్రోటోకాల్ లేని దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి స్టేజీ మీద నుంచి కిందకు దిగాలని బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు పట్టుబట్టారు. స్టేజీ పైనే ఉంటాడని కాంగ్రెస్ నాయకుల వాదించారు. ఇరు వర్గాలు పోటా పోటీగా నినాదాలు చేయడంతో సభా ప్రాంగణం మొత్తం దద్దరిల్లింది. దీంతో కార్యకర్తలను కంట్రోల్ చేసేందుకు పోలీసుల నానా తంటాలు పడ్డారు.