Customer: అప్పు ఇవ్వని షాప్ యజమాని.. కర్రతో దాడి చేసిన కస్టమర్
Customer: కూల్ డ్రింక్ అప్పు ఇవ్వలేదని షాప్ యజమానిపై దాడి చేసిన ఘటన కామారెడ్డి జిల్లా లో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట కాలనీలో సాగర్ కిరాణా షాప్ నడుపుతున్నాడు. షాప్‌కు వచ్చిన శేఖర్, సాగర్ తో మాటలు కలిపాడు. కూల్ డ్రింక్ ఇవ్వాలని కోరాడు. సరే అంటూ కూల్ డ్రింక్ తీసుకునే క్రమంలో తనకు అప్పుగా ఇవ్వాలని కోరాడు శేఖర్. దీని సాగర్ అప్పు ఇవ్వనని డబ్బులు ఉంటే ఇచ్చి తీసుకోవాలని కోరారు. అయితే తన దగ్గర డబ్బులు లేవని తిరిగి మళ్లీ ఇస్తానని చెప్పాడు శేఖర్. దీనికి సాగర్ ససేమిరా అన్నాడు. దీంతో తీవ్రంగా కోప్పడ్డాడు. డబ్బులు ఇవ్వకుండా పారిపోతామా కూల్ డ్రింక్ ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే దానికి నువ్వు ఎంత కోప్పడినా కూల్ డ్రింక్ అప్పుగా ఇచ్చేదే లేదని ఖరాఖండిగ చెప్పాడు.
దీంతో ఆగ్రహంతో ఊడిపోయిన శేఖర్.. షాప్ యజమాని సాగర్ పై పక్కనే ఉన్న కర్రతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. శేఖర్ దాడిని గమనించిన సాగర్ కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన శేఖర్ వెనుకాడలేదు.. వారిపై కూడా కత్తితో దాడికి దిగాడు. దీంతో సాగర్ కు కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు శేఖర్ ను పట్టుకోవడంతో షాప్ యజమాని సాగర్, వారి కుటుంబ సభ్యులు లోనికి వెళ్లారు. దీంతో ఇదే అలుసుగా భావించిన శేఖర్ అక్కడి నుంచి పరారయ్యాడు. షాప్ యజమాని సాగర్ కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కూల్ డ్రింక్ కోసం మాత్రమే శేఖర్.. సాగర్ పై దాడి చేశాడా? మరేమైనా కారణాలు ఉన్నాయా? లేక శేఖర్ ఏమైనా మద్యం సేవించి దాడి చేశాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
6G Technology: వచ్చేస్తోంది 6జీ టెక్నాలజీ..5జీ కంటే 100రెట్ల వేగం
Also Read
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!