కేసీఆర్ పై షర్మిల మరోసారి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. రైతన్నల చావులకు కేసీఆర్ కారణమంటూ దుయ్యబట్టారు. రైతులకు భరోసా ఇవ్వలేని ముఖ్యమంత్రి ఎందుకని షర్మిల ఎద్దేవా చేశారు. సాయం కోసం రోడ్డెక్కిన రైతన్న ఆగ్రహంతో మిమ్మల్ని అడ్డుకొంటారనా? రైతు చావులకు కారణం మీరేనని మిమ్మల్ని నిలదీస్తారనా? కరోనా వస్తుందనా? లేక ముఖ్యమంత్రిగా మీ బాధ్యత కాదనా?మీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు ఎందుకు దొరగారు?
పంట వానపాలు..రైతు కష్టం కన్నీటిపాలు..సాయం దొరమాటలకే చాలు పంట నష్టపోయి,పెట్టిన పెట్టుబడి రాక రోజుకు ఇద్దరు ముగ్గురు రైతులు పురుగుల మందు తాగి చనిపోతుంటే, నష్టపోయిన రైతును ఆదుకోడానికి, రైతును ఓదార్చడానికి ఫామ్ హౌస్ దాటి మీ కాలు బయటపడుతలేదా?
కష్టకాలంలో రైతులకు భరోసా ఇవ్వడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దు అంటూ కేసీఆర్ పై షర్మిల ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాయం కోసం రోడ్డెక్కిన రైతన్న ఆగ్రహంతో మిమ్మల్ని అడ్డుకొంటారనా?
— YS Sharmila (@realyssharmila) January 18, 2022
రైతు చావులకు కారణం మీరేనని మిమ్మల్ని నిలదీస్తారనా?
కరోనా వస్తుందనా? లేక ముఖ్యమంత్రిగా మీ బాధ్యత కాదనా?
మీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు ఎందుకు దొరగారు?
పంట వానపాలు
రైతు కష్టం కన్నీటిపాలు
సాయం దొరమాటలకే చాలు 1/2