షేక్‌పేట్ మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద మృతి చెందడం కలకలం రేపిన విషయం తెలిసిందే. సుజాత మృతితో పలు అనుమానాలు తావులేపుతున్న తరుణంలో నిమ్స్ వైద్యులు సుజాత మృతిపై క్లారిటీ ఇచ్చారు. మాజీ MRO సుజాత గుండె పోటుతోనే మృతి చెందారని నిమ్స్ వైద్యులు దృవీకంరించారు. శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో నిమ్స్ ఆసుపత్రిలో చేరిన సుజాత శనివారం ప్రాణాలు విడిచారని, సుజాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారని వైద్యులు తెలిపారు. మరికాసేపట్లో చిక్కడ పల్లికి సుజాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తరలించనున్నారు.
ఏసీబీ కేసులో సస్పెండైన సుజాత కొన్ని రోజులుగా మానసిక క్షోభకు గురయ్యారని సమాచారం. అయితే.. డెంగ్యూ తో పాటు హార్ట్ ఎటాక్ రావడంతో సుజాత చనిపోయిందని ఆమె బంధువులు తెలిపారు. అయితే 2020 జూన్ 8 న ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సుజాత ఇంటిపై దాడి చేసిన ఏసీబీ అధికారులు, ఆమెను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జూన్ 17న 40కోట్ల ల్యాండ్ డీలింగ్ విషయంలో లంచాలు తీసుకున్నట్లు తహసీల్దార్ సుజాత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈనేపథ్యంలో.. గాంధీనగర్‌లోని తన చెల్లెలు ఇంటికి తహసీల్దార్ సుజాత భర్త అజయ్ కుమార్ వెళ్లారు. చెల్లెలు ఇంటి నుంచి తిరిగివెళ్తూ అదే భవనంపైకి ఎక్కి కింది దూకి ప్రాణాలు తీసుకున్నారు. తన భార్య సుజాతను అవినీతి ఆరోపణలపై అరెస్టు చేయడాన్ని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డారు.
ల్యాండ్ భూవివాదం కేసులో లంచం తీసుకున్న ఆరోపణలపై తహసీల్దార్ సుజాత.. అవినీతి నిరోధక శాఖ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే ఆమెను ప్రభుత్వం సస్పెండ్ కూడా చేసింది.. అయితే, ఇవాళ సుజాత మృతిచెందారు. ఆమె గుండెపోటుతో మృతి చెందడంపై కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Sonali Phogat: సోనాలీ ఫోగాట్ నివాసంలో 3 డైరీలు స్వాధీనం.. వాటిలో ఏముంది?