Mulugu Accident: రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో, ఇతరుల తప్పు లేదా మన నిర్లక్ష్యం కారణంగా, రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. రోడ్డు మీద వెళుతున్నప్పుడు మనం జాగ్రత్త పాటిస్తే మనమే కాదు మన కుటుంబాన్ని కూడా కాపాడుకోవచ్చు. బైక్, కారులో వెళుతున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తులు తీసుకున్నా ఎందువారైనా, వెనుక నుంచి వచ్చిన వారైనా సరే వారు ప్రమాదానికి గురి కావడమే కాకుండా ముందుకు లేదా వెనుక వచ్చే వారికి ఢీ కొట్టడంతో వాళ్ళుకూడా మృతి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోడ్డు క్రాసింగ్, రోడ్డు దాటేప్పుడు కూడా మనం వెనక ముందు చూసుకోకుండా స్పీడ్ గా బైక్, కారు నడపడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కొన వలసి వస్తుంది. దీనికి పర్యవసానం నిండుప్రాణాలు బలికావాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనే ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. దీని సంబంధించిన వీడియోను సజ్జనార్ ట్విటర్‌లో షేర్ చేశారు.
Read also: Ashu Reddy : స్టన్నింగ్ లుక్స్ తో అదరగొడుతున్న అషు రెడ్డి..
ములుగు జిల్లా మంగపేటలోని తెలంగాణ సెంటర్ వద్ద శుక్రవారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కుటుంబంతో బైక్ పై వెలుతున్న వ్యక్తి కుడివైపు నుంచి వస్తున్న బస్సును గమనించలేదు. బైక్ పై ఇద్దరు పిల్లలు ముందు ఒకరు, తండ్రి వెనుక ఒకరు ఆ తరువాత భార్యను కూర్చున్నారు. స్పీడ్ హారన్ కూడా కొట్టుకోకుండా రోడ్డుపై వచ్చాడు. అయితే అంతే స్పీడ్ గా వుస్తున్న ఆర్టీసీ బస్సు బైక్ దగ్గరకు వస్తున్న గమనించకుండా బైక్‌ను ముందుకు తీసుకుని వెళ్లాడు అంతే వారిపై బస్సు ఒక్కసారిగా వెళ్లింది. దీంతో ఇద్దరు చిన్నారులు బస్సు చక్రాల కిందకు వచ్చేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. నిర్లక్ష్యం, పరధ్యానం వల్లే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని సజ్జనార్ దీనికి సంబందించిన వీడియోను షేర్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రూల్స్ పై సరైన అవగాహన లేకపోవడం కూడా ఈ తరహా ప్రమాదాలకు కారణమని తెలిపారు. రహదారులపై వాహనాలు నడిపేటప్పుడు నిత్యం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ రూల్స్‌ను విధిగా పాటించాలని కోరారు. ఇలా అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోకండని అన్నారు.
ఈ బైకర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఖరీదు రెండు నిండు ప్రాణాలు. ఇద్దరు కుమారులు, భార్యను ఎక్కించుకుని అజాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ బైక్ ను #TSRTC బస్సుకు ఢీకొట్టాడు. ములుగు జిల్లా మంగపేటలోని తెలంగాణ సెంటర్ వద్ద శుక్రవారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం… pic.twitter.com/5zv1y04a6X
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 17, 2023
Monsoon: ఏపీకి చల్లని కబురు.. రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. ఇక వర్షాలే..