DK. Aruna: గెలలిచిన వెంటనే డిసెంబర్ 9న అమలు చేస్తామన్న రెండు లక్షల రైతు రుణమాఫీ ఏమైంది? అని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే.అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం అడవిసత్యారం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో డీకే.అరుణ మాట్లాడుతూ.. అచ్చంపేట నుండి వచ్చిన రేవంత్ రెడ్డిని కొడంగల్ లో గెలిపించారు మన జిల్లా ప్రజలని తెలిపారు. మీ ఆడబిడ్డనైన నన్ను ఒక్కసారి గెలిపించి ఈ ప్రాంత అభివృదికి అవకాశం కల్పించాలన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారేంటిలో ఒక్క గ్యారెంటీ కూడా అమలుపర్చలేదన్నారు. రైతులు పండించిన వరి ధాన్యానికి సంచికి అదనంగా ఇస్తానన్న ఐదు వందల బోనస్ కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Dr K Laxman: కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తుంది..
రాష్ట్ర ప్రజలకు ఏమీ చేశామని ఓటు అడగడానికి వస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు అంటూ మండిపడ్డారు. గెలలిచిన వెంటనే డిసెంబర్ 9న అమలు చేస్తామన్న రెండు లక్షల రైతు రుణమాఫీ ఏమైంది? అని ప్రశ్నించారు. అన్ని జూటమాట్లు చెప్పే రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే నట్టేట్ల మునుగుతారు ప్రజలు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టు కోసం కూడా పోరాటం చేయలేదని తెలిపారు. అరుణమ్మ వచ్చిన తర్వాతే జిల్లాలో భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిలసాగర్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేసి నీరందించిందని అన్నారు. ఈ జిల్లాలో ఉంటే కదా అరుణమ్మ ఏమి చేసింది తెలుస్తుండే అన్నారు. గతంలో డీకే.అరుణ ఏమి చేసిందో ఇక్కడి స్థానిక ఎమ్మేల్యే కు తెలుసన్నారు.
Harish Rao: రేపు గన్ పార్క్ దగ్గర వస్తా.. నీకు దమ్ముంటే రా..? రేవంత్ కు హరీష్ రావు మరో సవాల్..