మే నాటికి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి : రజత్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు నిర్మాణ పనులను మే నెలాఖరులోగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి (ఇరిగేషన్) రజత్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లాలోని అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులను సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రెడ్డి, ఎల్ అండ్ టీ సీఈవో సుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేందుకు సమావేశం నిర్వహించారు. రూ.3,480 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాల్సి ఉందన్నారు. ప్రాజెక్టుకు అశ్వాపురం, చెర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని 63 గ్రామాల్లో 3121.14 ఎకరాల భూమి అవసరం. ఇప్పటి వరకు 2640.39 ఎకరాల భూమిని సేకరించగా అందులో 2485.18 ఎకరాల భూమిని నీటిపారుదల శాఖకు అప్పగించారు.
పరిహారంగా రూ.112.77 కోట్లు చెల్లించామని, మరో 740 ఎకరాల భూమిని అప్పగించాల్సి ఉందని, ఇందుకుగానూ రూ.59.20 కోట్లను భూ యజమానులకు పరిహారంగా చెల్లించాల్సి ఉందన్నారు. ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇసుకను సమకూర్చారు. నిర్మాణ పనులకు అవసరమైన యంత్రాలు, సిబ్బందిని అందుబాటులో ఉంచి పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. 36.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించే ప్రాజెక్టుకు 65 గేట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని రజత్ కుమార్ తెలిపారు.
Also Read
- CM Revanth Reddy : అమిత్ షాకు రేవంత్ రెడ్డి సవాల్.. ఓవైసీపై పోటీ చేయగలరా.?
- Illegal Egg Donation Case : అండాల అక్రమ దందాలో మరో ట్విస్ట్.. ఒక్కో అండం రూ.3 లక్షలకు విక్రయం
- Home Guards Recruitment : తెలంగాణలో 2 వేల హోంగార్డుల భర్తీకి కసరత్తు.. డీజీపీ కీలక సమీక్ష!
- Hyderabad Water Supply: హైదరాబాద్‌కు గోదావరి నీళ్లు.. మరో రెండు రోజుల్లో కీలక పనులు పూర్తి
తాజావార్తలు
-
Pakistan ISI Honey Trap: విడాకులు తీసుకున్న, నిరుద్యోగ భారతీయ మహిళలే టార్గెట్.. పాకిస్తాన్ ఐఎస్ఐ హనీట్రాప్!
-
CM Revanth Reddy : అమిత్ షాకు రేవంత్ రెడ్డి సవాల్.. ఓవైసీపై పోటీ చేయగలరా.?
-
Illegal Egg Donation Case : అండాల అక్రమ దందాలో మరో ట్విస్ట్.. ఒక్కో అండం రూ.3 లక్షలకు విక్రయం
-
AP Elections: ఏపీ జడ్పీ పరోక్ష ఎన్నికల్లో ఎన్డీయే కూటమి జైత్రయాత్ర.. 28 స్థానాల్లో 27 కైవసం..
-
Supreme Court: కార్తీక దీపానికి సుప్రీంకోర్టు అనుమతి.. విజయ్ సర్కార్‌కు ఎదురుదెబ్బ..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!