సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు నిర్మాణ పనులను మే నెలాఖరులోగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి (ఇరిగేషన్) రజత్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లాలోని అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులను సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రెడ్డి, ఎల్ అండ్ టీ సీఈవో సుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేందుకు సమావేశం నిర్వహించారు. రూ.3,480 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ ఈ…